అసెంబ్లీ(Assembly), పార్లమెంట్(Parliament) ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాజమండ్రిలో జరిగిన ‘సిద్ధం సభ’లో చెప్పు చూపించిన ఎంపీ మార్గాని భరత్ (MP Bharat)కు టీడీపీ(TDP), జనసేన (Janasena) నేతలు వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్‌ను బెదిరించారని ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. ఓ మహిళా వాలంటీర్‌తో ఆదిరెడ్డి ఫోన్లో మాట్లాడిన కాల్ రికార్డును సిద్ధం సభలో వినిపించారు. ఈ సందర్బంగా ఎంపీ.. అప్పారావుకు.. చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్పందించిన టీడీపీ, జనసేన నేతలు మంగళవారం ఎంపీ భరత్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అయితే, ఎంపీ భరత్ తనకు కుమారుడితో సమానంగా భావిస్తానని ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. చెప్పు తీస్తే గొప్పవాడివి అయిపోతానని అనుకుంటున్నావా? అని ఆయన ప్రశ్నించారు. నీ స్థాయి ఎంత..? వాలంటీర్‌తో గౌరవంగానే మాట్లాడాను.. నా కుమారుడికి టికెట్ రావడంతో ఎంపీ భరత్‌కు మతిపోయింది.. భరత్ విషయాలు బయట పెట్టాలంటే చాలా ఉన్నాయంటూ ఆదిరెడ్డి ఫైర్ అయ్యారు.
కాగా, భరత్ ఎంపీగా ఉండి ఆరు నియోజవర్గాలు గాలికి వదిలేశారని ఆదిరెడ్డి అప్పారావు మండిపడ్డారు. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో పర్యటిస్తే ఎంపీకి ప్రజలు చెప్పు చూపిస్తారని ఆయన విమర్శించారు. ఎంపీ భరత్ ఫెయిల్యూర్ హీరో.. రాజమండ్రిలో సినిమా సెట్టింగులు వేశారు’’ అంటూ ఆదిరెడ్డి ఎద్దేవా చేశారు.