ఏపీ (AP) స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development)కేసులో రాజమండ్రి (Rajahmundry) సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)ను ఆయన భార్య నారా భువనేశ్వరి, లోకేశ్, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఈ రోజు కలిశారు. ములాఖత్ లో బాబుతో కీలక విషయాలు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్.. ప్రజల మధ్యకు చంద్రబాబును రానీయకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
బాబు కేసులో తీర్పును వాయిదాల మీద వాయిదాలు వేస్తూ 50రోజులు గడిపారని.. కేసులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయంటూ.. లేనివి ఉన్నట్టు చెబుతూ ప్రజలను నమ్మించాలని వైసీపీ ప్రయత్నిస్తుందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించడం తప్పుకాదని.. కానీ ప్రాణాలు తీయాలని చూడటం క్షమించరాని నేరమని లోకేష్ అన్నారు..
ఇలాంటి పనులు చేయడంలో వైసీపీ నేతలు ముందు ఉంటారని లోకేష్ ఆరోపించారు. మరోవైపు జైలులోనే చంద్రబాబు చనిపోతారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. కేసులతో ఎలాంటి సంబంధం లేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని లోకేష్ చెప్పారు. ఇంతలా జరుగుతున్న ఈ కేసు విషయంలో స్పందించే వారు కరువైయ్యారని ఆవేదన చెందారు లోకేష్..
ఒక్క రూపాయి కూడా అవినీతి చేయని బాబుని ఈ వయస్సులో ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదని.. తాము తప్పు చేశామని అనుకుంటే ఆధారాలు ప్రజల ముందుంచాలని లోకేశ్ సవాల్ చేశారు.. స్కాంలతో తమకు, తమ పార్టీ నేతలకు, బంధుమిత్రులకు ఎలాంటి సంబంధం లేదని నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీ ఆగం అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వం కుట్రలు మాత్రం బాగా ఒంటపట్టించుకుందని ఆరోపించారు..
వ్యవస్థలను మేనేజ్ చేయకపోతే జగన్ బెయిల్ పై పదేళ్లు బయట ఎలా ఉన్నారని.. సొంత బాబాయిని చంపిన అవినాష్ బయట ఎలా ఉన్నారని ప్రశ్నించారు. రైతులకోసం కాకుండా.. పదవుల కోసం బస్సు యాత్ర పేరుతో గాలి యాత్ర చేస్తున్న సైకో జగన్ ఈ ఎన్నికలు నీకు చివరి ఎన్నికలు అంటూ లోకేశ్ హెచ్చరించారు..