తిరుపతి (Tirupati) శ్రీపద్మావతి విశ్వవిద్యాలయంలో ఉమెన్ ఎంపవరింగ్ ఉమెన్ సెమినార్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏపీ మంత్రి రోజా (Roja) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలు విమర్శలకు భయపడి పారిపోవద్దని పోరాటం మాత్రమే చేయాలని పిలుపునిచ్చారు. లింగ వివక్షత అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంటువ్యాధి లాంటిదని యువతరం దానిని మార్చాలని కోరారు.
సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) చరిత్రలో ఎవరు చేయని విధంగా మహిళల కోసం కృషి చేస్తున్నారని.. లక్షలాది మహిళల అకౌంట్స్‌లో నేరుగా కోట్లాది రూపాయల డబ్బులు వేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. దేశంలో మహిళలు పాలు ఇచ్చే స్థాయి నుండి పాలించే స్ధాయికి ఎదిగారని, 33 శాతం రిజర్వేషన్ల ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
వివిధ రంగాల్లో ఉన్న రాజకీయాలు మహిళలను వెనక్కి తరిమేసేలా ఉన్నాయని, వాటికి భయపడకుండా మనం చేస్తున్న పని తప్పా, ఒప్పా అని మనకు తెలుస్తే చాలన్నారు. సినిమా (Cinema) వాళ్లు బ్లూ ఫిలింలు చేస్తారని వచ్చిన విమర్శలకు ఘాటుగా స్పందించారు.
మనం చేస్తున్న పని మన మనసాక్షికి తెలిస్తే చాలు.. ఎవరో ఎదో తిట్టారని భయపడి వెనక్కి అడుగు వేయకుండా ముందుకే వెళ్లాలన్నారు. మహిళల కోసం ఎంతో పోరాటం చేశాను.. ఉద్యమాలు చేశానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు మంత్రి ఆర్కే రోజా.