Telugu News » HARSIH RAO : రేపు పొద్దున గన్‌‌పార్క్ వద్దుకు వస్తున్నావా రేవంత్ రెడ్డి.. నేను సిద్ధమన్న హరీశ్ రావు!

HARSIH RAO : రేపు పొద్దున గన్‌‌పార్క్ వద్దుకు వస్తున్నావా రేవంత్ రెడ్డి.. నేను సిద్ధమన్న హరీశ్ రావు!

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో సవాళ్ల రాజకీయం జోరుగా నడుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) విసిరిన సవాల్‌ను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA HARISH RAO) స్వీకరించిన విషయం తెలిసిందే. పంద్రాగస్టులోపు రుణమాఫీ(FARMERS DEBT CLEAR) చేయాలని లేదంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.

by Sai
Are you coming to Gunpark tomorrow morning, Revanth Reddy.. I am Siddhamanna Harish Rao!

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో సవాళ్ల రాజకీయం జోరుగా నడుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) విసిరిన సవాల్‌ను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA HARISH RAO) స్వీకరించిన విషయం తెలిసిందే. పంద్రాగస్టులోపు రుణమాఫీ(FARMERS DEBT CLEAR) చేయాలని లేదంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుంటే తాను రాజీనామా చేస్తానని.. మళ్లీ పోటీ చేయనని చెప్పిన విషయం తెలిసిందే.

Are you coming to Gunpark tomorrow morning, Revanth Reddy.. I am Siddhamanna Harish Rao!

గురువారం మెదక్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగులో హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి మరో సవాల్ విసిరారు. ‘రేపు పొద్దున 10 గంటలకు గన్ పార్క్ దగ్గర వస్తా.. ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే..ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి. మనమిద్దరం మన రాజీనామా లేఖలని మేధావులకి ఇద్దాం.
నువ్ ఇచ్చిన హామీలు అమలు చేస్తే, నేను నా రాజీనామా లేఖని స్పీకర్‌కి ఇస్తరు.

నువ్ చెయ్యకపోతే నీ రాజీనామా లేఖని గవర్నర్‌కి ఇస్తారు.రేవంత్ రెడ్డి నువ్ సిద్ధమా..నీకు దమ్ముంటే రా?. కొడంగల్‌లో తోక ముడిచినట్టే తోక ముడుస్తావా?’ అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ మెదక్‌కు ఏం చేసిండు అని రేవంత్ అడుగున్నాడు. ఏం చేసిండు బిడ్డా లిల్లిపుట్..నువ్వు మెదక్ వచ్చావంటే అది కేసీఆర్ వల్లనే. మెదక్‌ని జిల్లా చేస్తేనే నువ్ మెదక్ వచ్చావు.లేకపోతే సంగారెడ్డిలో నామినేషన్ వేసేవాడివి.రేవంత్ రెడ్డికి స్క్రిప్ట్ రైటర్ సరిగా లేడు..సరిగా రాసిస్తలేరు.

ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇజ్జత్ మానం తీసుకుంటున్నాడు.నీ పరువు పోతే పోయింది.కానీ, సీఎం పదవి విలువ తగ్గిస్తున్నావ్.
బాండ్ పేపర్‌కి వాల్యూ ఉండేది. కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్ ఇచ్చాక దాని వాల్యూ కూడా పడిపోయింది. ఇప్పుడు ఎక్కడపోతే అక్కడ దేవుళ్ళకు దండం పెడుతున్నారు.
నా ఎత్తు గురించి మాట్లాడే ధ్యాస రేవంత్‌కి ఉంది కానీ, రైతుల వడ్లు అమ్ముడుపోతలేవు అది చూడు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దూకినట్టే. దుబ్బాకలో ఏదేదో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు. బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది. కానీ, పేదల గురించి పట్టించుకోదు’ అని హరీశ్ రావు కీలకవ్యాఖ్యలు చేశారు.

You may also like

Leave a Comment