Telugu News » Arun Kumar Jain: తెలంగాణలో రూ.230 కోట్లతో 15 అమృత్ భారత్ స్టేషన్లు..!

Arun Kumar Jain: తెలంగాణలో రూ.230 కోట్లతో 15 అమృత్ భారత్ స్టేషన్లు..!

తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో త్వరలో రూ.230 కోట్లతో 15అమృత్ భారత్ స్టేషన్‌లను నిర్మించనున్నట్లు సెంట్రల్ రైల్వే జీఎం వెల్లడించారు.

by Mano
Arun Kumar Jain: 15 Amrit Bharat stations in Telangana with Rs.230 crores..!

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్(South Central Railway General Manager Arun Kumar Jain) కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో త్వరలో రూ.230 కోట్లతో 15అమృత్ భారత్ స్టేషన్‌లను నిర్మించనున్నట్లు వెల్లడించారు.

Arun Kumar Jain: 15 Amrit Bharat stations in Telangana with Rs.230 crores..!

దేశవ్యాప్తంగా ప్రధానిమోడీ 500కు పైగా అమృత్ భారత్ స్టేషన్లకు భూమిపూజ, ప్రారంభోత్సవం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 26న పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ఉంటాయని ఆయన తెలిపారు.

రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ చేస్తారన్నారు. అదేవిధంగా 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లకు భూమి పూజ ప్రారంభోత్సం ఉంటుందన్నారు. తెలంగాణలో రూ.230 కోట్లతో 15అమృత్ భారత్ స్టేషన్లతో పాటు మరో రూ.169 కోట్లతో 17 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు.

32 రైల్వే ఫైఓవర్లు, అండర్ పాస్‌లను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విలువ దాదాపు రూ.621 కోట్లు ఉంటుందన్నారు. రాష్ట్రంలో 40 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి ఖర్చు రూ.2,245 కోట్లు ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ 21 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి భూమిపూజ చేశారు.

You may also like

Leave a Comment