Telugu News » Arunachal Pradesh: అరుణాచల్‌ప్రదేశ్‌పై డ్రాగన్ కంట్రీ కన్ను.. భారత్‌కు అమెరికా మద్దతు..!

Arunachal Pradesh: అరుణాచల్‌ప్రదేశ్‌పై డ్రాగన్ కంట్రీ కన్ను.. భారత్‌కు అమెరికా మద్దతు..!

చైనా ప్రకటన అసంబద్ధమైనదని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్ భారత్‌లో అంతర్భాగంగా గుర్తిస్తున్నామని అమెరికా వెల్లడించింది.

by Mano
Arunachal Pradesh: Dragon country's eyes on Arunachal Pradesh.. America's support for India..!

భారత్‌(Bharath)లోని అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)పై డ్రాగన్ కంట్రీ చైనా(China) కన్నేసింది. ఆ రాష్ట్రం తమదేనంటూ మొండిగా వ్యవహరించి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. దీనిపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.

Arunachal Pradesh: Dragon country's eyes on Arunachal Pradesh.. America's support for India..!

 

జాంగ్నాన్ తమదే, సేలా సొరంగాన్ని భారత్ చట్టవిరుద్ధంగా స్థాపించిందంటూ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ షియాగాంగ్ (Colonel Zhang Xiaogong) ఈనెల 15న పేర్కొన్నారు. దీనిపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

చైనా ప్రకటన అసంబద్ధమైనదని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్ భారత్‌లో అంతర్భాగంగా గుర్తిస్తున్నామని అమెరికా వెల్లడించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని స్పష్టం చేసింది.

అరుణాలు దక్షిణ టిబెట్ చైనా ఆరోపణలపై స్పందిస్తూ అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ఈ ప్రకటన చేశారు. సైన్యం లేదా పౌరులు వాస్తవాధీన రేఖ అవతల ఆక్రమణలకు పాల్పడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.

You may also like

Leave a Comment