ఢిల్లీ (Delhi) మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న క్రేజీ వాల్ డైట్ పై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆయన హెల్త్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో (Rouse Avenue Court) విచారణ జరిగింది. ఈ క్రమంలో షుగర్ కు వైద్యం కోసం ప్రయివేట్ డాక్టర్ కన్సల్టెంట్ కు అనుమతి ఇవ్వాలని వేసిన పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు ముగిశాయి. కాగా తీర్పును సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి కావేరి బవేజా ప్రకటించారు.
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తరపున అభిషేక్ మను సింఘ్వీ, రమేష్ గుప్త వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ కి షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని తెలిపారు. 15 నిమిషాలు వర్చువల్ గా డాక్టర్ ను కలిసేందుకు కోర్టు ఆయనకి అనుమతి ఇవ్వాలని కోరారు.. ఇదిలా ఉండగా తీహార్ జైల్ లాయర్ తన వాదనలు వినిపిస్తూ.. ఎయిమ్స్ నివేదిక ప్రకారం మ్యాంగో, బనానాలతో పాటూ కొన్ని ఆహార పదార్థాలు షుగర్ ఉన్నవారు తీసుకోవద్దని తెలిపారు..
జైల్లో క్రేజీవాల్ ఆరోగ్యం మెరుగ్గానే ఉంది, షుగర్ లెవెల్స్ మెయింటేన్ అవుతున్నాయని కోర్టుకు వివరించారు.. డైట్ చార్ట్ ప్రకారం మాత్రమే ఫుడ్ అనుమతి ఉంటుందన్నారు.. ఆయన షుగర్ లెవెల్స్ జైల్ డాక్టర్లు ఎప్పటికప్పడు మానిటరింగ్ చేస్తున్నారని.. అవసరం అయితే జైల్లో ఇన్సులిన్ కూడా ఇస్తామని పేర్కొన్నారు.. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకొంది.
సీబీఐ (CBI) కేస్ లో శరత్ చంద్ర రెడ్డి అప్రూవర్ గా మారినట్లు సమాచారం.. ఈ మేరకు ఈ రోజు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు 164 సెక్షన్ కింద ఆయన వాంగ్మూలం నమోదు అయినట్లు తెలుస్తోంది.. కాగా గతంలో ఈడీ కేసులోనూ అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే.. మరోవైపు మద్యం స్కామ్ కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవ, దినేష్ అరోరా..