Telugu News » Aravind Kejriwal : అలా చేస్తే శివరాజ్ సింగ్ చౌహాన్… వసుంధర రాజేలు కొత్త పార్టీ పెడతారు…!

Aravind Kejriwal : అలా చేస్తే శివరాజ్ సింగ్ చౌహాన్… వసుంధర రాజేలు కొత్త పార్టీ పెడతారు…!

ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని ఆప్ పేర్కొంది. బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

by Ramu
Arvind Kejriwal skips Enforcement Directorates sixth summons AAP says matter in court now

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని ఆప్ పేర్కొంది. బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

Arvind Kejriwal skips Enforcement Directorates sixth summons AAP says matter in court now

ఈడీని మూసి వేస్తే, మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45ను రద్దు చేస్తే చాలా మంది బీజేపీ నేతలు ఆ పార్టీని వీడతారని అన్నారు. అలా చేస్తే ఆ పార్టీ సీనియర్ నేతలు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే సిందియా లాంటి వాళ్లు కొత్త పార్టీ పెట్టుకుంటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ నేత, న్యాయవాది అభిషేక్ సింఘ్వీ నివాసంలో లంచ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటి వరకు ఆయన ఆరు సార్లు ఈడీ నోటీసులను ధిక్కరిస్తూ విచారణకు గైర్హాజరు అయ్యారు.

ఈడీ సమన్లు చట్టవిరుద్ధమైనవని ఆప్ నేత చెబుతూ వస్తున్నారు. ఈ సమన్లు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని కేజ్రీవాల్ విమర్శించారు. తనను ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే ఈ సమన్లను పంపించినట్లు ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఆప్ కీలక నేతలైన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసి, జైలులో వేసింది.

You may also like

Leave a Comment