దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయుకాలుష్యం (Air Pollution) ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నది. దేశానికి రాజధాని అయిన ప్రజల అనారోగ్యానికి మాత్రం కేరాఫ్ గా ఢిల్లీ మారడం ఆందోళనకర విషయం అంటున్నారు నెటిజన్స్. మరోవైపు చలికాలం (winter) వచ్చిందంటే చాలు.. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోవడం.. వాయు కాలుష్యం పెరగడం ప్రతి సంవత్సరం జరుగుతున్నదే..
ఇక దేశంలో ఏవైనా అనుకోని విపత్తులు ఎదురైతే ఆ ప్రభావం ముందుగా విద్యార్థుల పై పడటం చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్న దృష్ట్యా ప్రాథమిక పాఠశాలలు నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రభుత్వం నిర్ణయించిందని, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి తెలిపారు.
మరోవైపు 6 నుండి 12 తరగతి వరకి ఆన్‌లైన్ క్లాస్ లు నిర్వహించుకోవచ్చని ఆయన సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి తెలిపారు. కాలుష్యం మూలంగా పిల్లల ఆరోగ్యానికి హానికలుగుతుందని భావించిన ప్రభుత్వం 2023 నవంబర్ 10 నాటికి ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి అతిషి అన్నారు.