Telugu News » Ashwini Vaishnaw: త్వరలో ఏఐ నియంత్రణపై చట్టం.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!

Ashwini Vaishnaw: త్వరలో ఏఐ నియంత్రణపై చట్టం.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!

కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఓ ఇంటర్వ్యూలో కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) నియంత్రణకు చట్టం తీసుకొస్తామని వెల్లడించారు.

by Mano
Ashwini Vaishnaw: Law on control of AI soon.. Union Minister's key announcement..!

ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతోంది. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే, ఏఐ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నష్టమూ ఉన్నది. ఇప్పటికే పలువురు సెలిబ్రెటీలకు సంబంధించిన డీప్ ఫేక్(Deep Fake) వీడియోలు వైరల్ కావడం కలకలం రేపింది.

Ashwini Vaishnaw: Law on control of AI soon.. Union Minister's key announcement..!

ఈ తరుణంలో ప్రభుత్వం సాంకేతికత నియంత్రణపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఓ ఇంటర్వ్యూలో కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) నియంత్రణకు చట్టం తీసుకొస్తామని వెల్లడించారు.

ఏఐ నియంత్రణ అనేది చట్టబద్ధంగానే జరగాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే టెక్ కంపెనీలతో మాట్లాడామని, ఎన్నికల తర్వాత మరో దఫా చర్చిస్తామన్నారు. డీప్ ఫేక్‌ను కట్టడి చేసేలా, సరికొత్త ఆవిష్కరణలకు ఎలాంటి విఘాతం కలగకుండా చట్టాన్ని రూపొందిస్తామన్నారు. ఏఐ కోసం స్వీయ నియంత్రణ అనేది ఏమాత్రం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది చట్టబద్ధంగానే జరగాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు ముగిశాక ఈ ప్రక్రియను ప్రారంభిస్తాభిస్తామన్నారు. ఇప్పటికే పరిశ్రమ వర్గాలతో చర్చించామని, ఎన్నికల తర్వాత మరోసారి చర్చించి చట్టం తీసుకొస్తామని వైష్ణవ్ తెలిపారు. సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు విఘాతం కలగకుండా ఈ చట్టాన్ని తీసుకొస్తామన్నారు.

You may also like

Leave a Comment