Telugu News » Unfortunate : చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన అశ్వినీదత్..!

Unfortunate : చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన అశ్వినీదత్..!

ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్(Ashwinidat)టీడీపీ అధినేత,మాజీ సీఎమ్ చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ పై రియాక్ట్ అయ్యారు.

by sai krishna

ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్(Ashwinidat)టీడీపీ అధినేత,మాజీ సీఎమ్ చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ పై రియాక్ట్ అయ్యారు. బాబు అరెస్ట్‌ ను ఆయన ఖండించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనపై కుట్ర పన్నిన వారికి పుట్టగతులు ఉండవంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


చంద్రబాబుపై అక్రమ కేసులు(Illegal cases)పెట్టినవారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని అశ్వినీదత్ అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబును దుర్మార్గంగా అరెస్ట్ చేశారని, దేశ రాజకీయాల్లోనే కీలక నేతగా ఉన్న ఆయనపై కుట్రలు చేయడం దురదృష్టకరమని విమర్శలు కురిపించారు.

దేశానికి గొప్ప ప్రధానిని, స్పీకర్‌ని, రాష్ట్రపతిని అందించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అశ్వినీదత్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లలో గెలుస్తుందని అశ్వినీదత్ ఈ సందర్భంగా జోస్యం చెప్పారు.

చంద్రబాబు అరెస్ట్, జైలుకు తరలించడంపై ఇప్పటికే జాతీయ నేతలు స్పందిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను అరెస్ట్ చేశారని విమర్శిస్తున్నారు. అలాగే టాలీవుడ్ నుంచి నిర్మాత నట్టి కుమార్ ఖండించగా.. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.

You may also like

Leave a Comment