అసోంలోని కజిరంగా నేషనల్ పార్కు (Kaziranga National Park)లో ఇటీవల కనిపించిన గోల్డెన్ టైగర్ ఫోటోను అసోం సీఎం హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Sarma)షేర్ చేశారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్బంగా గురువారం ఆ ఫోటోను ఆయన షేర్ చేశారు.
మెజెస్టిక్ బ్యూటీ…. ఇటీవల కజిరంగా పార్కులో కనిపించిన అత్యంత అరుదైన గోల్డెన్ టైగర్ ఇదేనంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ఫోటోకు నేషనల్ టూరిజమ్ డే అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. సీఎం హిమంత శర్మ ఆ ఫోటోను షేర్ చేసిన కొద్ది గంటల్లోనే దానికి సుమారు 2 లక్షల వకు వ్యూవ్స్ వచ్చాయి.
ట్వీట్ ను సుమారు 14,000 మంది లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఇది మెజిస్టిక్ బ్యూటీ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘అడవికి నిజమైన రాజు’అని మరి కొందరు…. “ఎంత అందమైన కిట్టి అని ఇంకొందరు…. “వావ్. ఎంత మనోహరమైనది’అంది కామెంట్స్ చేశారు.
అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్లో అరుదైన గోల్డెన్ టైగర్ (బంగారు వర్ణపు పులి) సంచరిస్తోంది. ఇటీవలే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేశ్ హెంద్రే ఈ పులికి సంబంధించిన ఫోటోలను తీశారు. దీంతో గోల్డెన్ టైగర్ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ ఫోటోలనే సీఎం హిమంత బిస్వ శర్మ ట్వీట్ చేశారు.