Telugu News » Kaleshwaram : లక్ష కోట్ల నోటును రిలీజ్‌ చేసిన కాంగ్రెస్.. కేసీఆర్‌ కోసమేనా..?

Kaleshwaram : లక్ష కోట్ల నోటును రిలీజ్‌ చేసిన కాంగ్రెస్.. కేసీఆర్‌ కోసమేనా..?

కాళేశ్వరం ఏటీఎంను ఆవిష్కరించి ప్రచారంలోకి దిగింది కాంగ్రెస్‌ పార్టీ. అధికార బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించే క్రమంలో ఈ వెరైటీ కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చం‍ద్రశేఖర్‌రావు ఫొటోతో కూడిన కాళేశ్వరం ఏటీఎంను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఆ ఏటీఎంల పై కాళేశ్వరం కరప్షన్ రావు( KCR)అని పేర్కొంటూ కేసీఆర్ ఫొటోను ముద్రించింది.

by Venu

తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల (Assembly-Elections) ప్రచారంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ (Congress)పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది. బీఆర్ఎస్ (BRS)అవినీతి పై వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం (kaleshwaram)లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో మొదటి నుంచి అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న హస్తం.. ఇప్పుడు ఆ ఆరోపణలనూ కాంగ్రెస్ కి హార్లిక్స్ లా వాడుకుంటోంది.

తాజాగా.. కాళేశ్వరం ఏటీఎంను ఆవిష్కరించి ప్రచారంలోకి దిగింది కాంగ్రెస్‌ పార్టీ. అధికార బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించే క్రమంలో ఈ వెరైటీ కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చం‍ద్రశేఖర్‌రావు ఫొటోతో కూడిన కాళేశ్వరం ఏటీఎంను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఆ ఏటీఎంల పై కాళేశ్వరం కరప్షన్ రావు( KCR)అని పేర్కొంటూ కేసీఆర్ ఫొటోను ముద్రించింది.

అలాగే కేసీఆర్‌ పేరుతో లక్ష కోట్ల నోటును రిలీజ్‌ చేసింది. ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్‌ కాళేశ్వరం అంటూ ఆ ఏటీఎంపై కాంగ్రెస్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు తెలియజేస్తున్నారు. మరోవైపు ఈ ఏటీఎంలను హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.

You may also like

Leave a Comment