తెలంగాణలో రాజకీయాలన్నీ రాష్ట్ర అభివృద్ధి చుట్టే తిరుగుతున్నాయని అనుకుంటున్నారు. ప్రచారాల్లో నేతలు కూడా ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారని కొందరు అంటున్నారు. మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) కరీంనగర్ (Karimnagar)లోని బొమ్మకల్ (Bommakal)నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు..
తెలంగాణ రాష్ట్రం రాకముందు అభివృద్ధి శూన్యం.. కరెంటు నీళ్లు లేక రైతులు అష్ట కష్టాలు పడేవారు.. కరెంటు ఎప్పుడు వస్తుందని కళ్ళల్లో వత్తులేసుకొని కాపలా కాసే వారు.. సరైన ఉపాధి లేక కరువు కాటకాలతో రైతులంతా దుబాయ్ కి వలసలు వెళ్లారు అని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అలాంటి రాష్ట్రాన్ని అన్నీ రంగాలలో కేసీఆర్ అభివృద్ధి చేశారని గుర్తు చేశారు..
కరీంనగర్ ప్రజలు 2009లో నన్ను గెలిపించి ఆశీర్వాదం అందించారు.. కరీంనగర్ చరిత్రలో ఎవరికి లేని అదృష్టం నాకే దక్కించారు.. మూడోసారి కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు.. ఈ సారి కూడా నా గెలుపు మీ చేతుల్లో పెడుతున్నా అని గంగుల అన్నారు. ఇక మొదటి ప్రచారం బొమ్మకల్ నుండి చేయడం ఆనవాయితీ.. అందుకే కాలువ నరసయ్య ఇంట్లో నుంచి ప్రచారం మొదలు పెట్టానని గంగుల కమలాకర్ తెలిపారు..
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ చేతులలో తెలంగాణ పెడితే అభివృద్ధి కుంటుపడుతుంది అని విమర్శించారు.. ఈ ఎన్నికల్లో ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలి అని గంగుల కోరారు. అయితే ఈ ప్రచారంలో గంగుల మరోసారి పదవిని అలంకరించాలనే ఆశపడుతున్నట్టు తెలుస్తుందని బయట గుసగుసలు వినిపిస్తున్నాయి..