Telugu News » మోడీ నేమ్ ప్లేట్ పై భారత్ పేరు.. మరోసారి తెరపైకి దేశం పేరు మార్పు అంశం…!

మోడీ నేమ్ ప్లేట్ పై భారత్ పేరు.. మరోసారి తెరపైకి దేశం పేరు మార్పు అంశం…!

by Ramu
at g20 summit opening pm modi nameplate sends a bharat message
ఇండియా వర్సెస్ భారత్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా జీ-20 సదస్సులో ప్రధాని మోడీ నేమ్ ప్లేట్ పై ఇండియా  బదులుగా భారత్ అని ముద్రించారు. దీంతో పాటు బుక్ లెట్ భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని ముద్రించడంతో మరోసారి చర్చకు దారి తీసింది. దేశం పేరును మారుస్తున్నారంటూ మరోసారి వార్తలు ఊపందుకున్నాయి.
at g20  summit opening pm modi nameplate sends a bharat message
మొదట జీ-20 నేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వాన లేఖలు పంపారు. అందులో ఇండియా ప్రెసిడెంట్ కు బదులుగా భారత ప్రెసిడెంట్ అని ముద్రించారు. దీంతో దేశం పేరును ఇండియాకు బదులు భారత్ అని మారుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.
 ఆ తర్వాత దేశం పేరు మార్చాలని కేంద్రం నిర్ణయించిందని వార్తలు చెక్కర్లు కొట్లాయి. దేశం పేరును మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టనున్నట్టు ఊహగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో  కేంద్రంపై విపక్ష ఇండియా కూటమి నేతలు తవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
దేశ చరిత్రను వక్రీకరించేందుకు ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్నారని నేతలు ఫైర్ అయ్యారు. దేశాన్ని విభజించేందుకు కాషాయ ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు  గుప్పిస్తున్నారు. తాజాగా నేమ్ ప్లేట్ తో మరోసారి ఈ అంశంపై తీవ్ర స్థాయిలో రచ్చ జరుగుతోంది.

 

You may also like

Leave a Comment