Telugu News » Pushpa-2 Update : పుష్ప-2 మూవీ గురించి ఇంట్రస్టింగ్ హింటిచ్చిన దేవీశ్రీ..!

Pushpa-2 Update : పుష్ప-2 మూవీ గురించి ఇంట్రస్టింగ్ హింటిచ్చిన దేవీశ్రీ..!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar)సినిమా అంటే మినిమమ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కానీ పుష్ప-2 మాత్రం అంచనాలకు మించి ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్.

by sai krishna

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar)సినిమా అంటే మినిమమ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కానీ పుష్ప-2 మాత్రం అంచనాలకు మించి ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప- ది రూల్‌(Pushpa- The Rule)’ కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.


తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్‌ (pushpa 2 music director).. ‘పుష్ప 2’ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. ఈ సారి సినిమా మరో స్థాయిలో ఉండనుందని తెలిపారు.

దేవిశ్రీ మాట్లాడుతూ “ఈ చిత్రం కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడే ఎక్కువ విషయాలను చెప్పలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు సుకుమార్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా మైండ్‌ బ్లోయింగ్‌ స్క్రిప్ట్‌. ఒక సీక్వెన్స్‌ కు సంబంధించిన విజువల్ను నేను చూశాను. ఆ సీక్వెన్స్‌ గురించి ఇప్పుడు ఎక్కువగా చెప్పను. కానీ అది మాత్రం మైండ్‌ బ్లోయింగ్‌ సీక్వెన్స్‌” అని దేవిశ్రీ ప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయంలో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

You may also like

Leave a Comment