ఖమ్మం (Khammam) జిల్లా, సత్తుపల్లి మండలం, చంద్రాయపాలెం (Chandrayapalem)లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది. బుగ్గపాడు, చంద్రాయపాలెంకు చెందిన గిరిజన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల మధ్య పోడు భూమి విషయంలో వివాదం ఏర్పడగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అయితే గొడవ సద్దుమణిగించడానికి పోలీసులు ప్రయత్నించడంతో కొందరు గిరిజనులు పోలీసులపై దాడి దిగినట్లు తెలుస్తోంది.
పోడుభూముల వ్యవహారంలో తలెత్తిన వివాదాన్ని ఆపడానికి ప్రయత్నించిన పోలీసులపై గిరిజనలు దాడికి దిగడంతో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో సతత్తుపల్లి (Sattupalli) సీఐ కిరణ్ తో పాటుగా నలుగురు సిబ్బదికి గాయాలు అయ్యాయని సమాచారం.. కాగా ఈ ఘర్షణను అడ్డగించిన పోలీసులను గిరిజనలు వెంటపడి మరీ కర్రలతో కొట్టినట్లుగా తెలుస్తోంది.
ఇక ప్రభుత్వాలు ఎన్ని మారిన గిరిజనుల పోడు భూముల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. దీంతో ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో సార్లు ఘర్షణలు జరిగాయి.. అధికారులు లాఠీ ఛార్జీ చేసిన సంఘటనలున్నాయి.. గత ప్రభుత్వం పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినప్పటికి అవి మాటల వరకే పరిమితం అయిన విషయం తెలిసిందే..