హరీష్ రావు, తెలంగాణ మంత్రి
మరోసారి గెలిచి సీఎం (CM)గా కేసీఆర్ (KCR) హ్యాట్రిక్ సాధించడం ఖాయం. కాంగ్రెస్ లాంటి పార్టీలు ఎన్నికల వేళ స్టంట్లు చేస్తాయి. బీజేపీ ఎంపీ బండి సంజయ్ హామీలు ఇస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేలేరు. తెలంగాణ పట్ల బీజేపీకి బరువు లేదు, కాంగ్రెసుకు బాధ్యత లేదు. తెలంగాణలో హక్కుల గురించి ఒక్కనాడైనా రాహుల్‌గాంధీ మాట్లాడారా ?
బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటి.. గుజరాత్లో ఎన్నికలు జరిగితే రాహుల్‌గాందీ పక్క రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. తెలంగాణలో ఉన్న పథకాలను చూసి నేర్చుకోండి.. మీ రాష్ట్రాల్లో అమలు చేయండి. వివిధ రాష్ట్రాల్లోని నాయకులు నగరానికి వచ్చి హైదరాబాద్ నగర అభివృద్ధి, పల్లెల ప్రగతి చూడాలి. సినీ నటుడు రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి మెచ్చుకున్నారు.
కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో నిరంతరం తాగునీరు కష్టాలే, ఎప్పుడు ధర్నాలు, ఆందోళనలు ఉండేవి.తెలంగాణలో ఇచ్చినట్లు రైతు బీమా ఇవ్వండి, ఇంటింటికీ తాగు నీరు, ఉచిత 24 గంటల కరెంట్ ఇవ్వండి.
60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ చేసేదేమీ లేదు.. కనీసం ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏమీ చేయడం లేదు.తెలంగాణలో రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ అబద్ధాలకు, తమ అభివృద్ధికి మధ్య జరగబోతోంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయరు. తెలంగాణా ఇస్తామని చెప్పి మోసం చేసింది. ప్రజలు తిరగబడే సరికి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ ఏ రంగంలోనూ మాతో పోటీ పడలేదు.