Telugu News » Heavy Rains: వాతావరణశాఖ అలర్ట్, మరో ఐదు రోజులు వర్షాలు

Heavy Rains: వాతావరణశాఖ అలర్ట్, మరో ఐదు రోజులు వర్షాలు

ఉపరితల ఆవర్తనం (Truf) వాయువ్యానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవాళ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

by Prasanna
heavy rains

తెలంగాణ (Telangana) లో రానున్న  ఐదు రోజుల పాటు వర్షాలు (Heavy Rains) పడతాయని  తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  ఇవాళ కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉపరితల ఆవర్తనం (Truf) వాయువ్యానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవాళ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

heavy rains

దాని ప్రభావంతో రేపటి నుంచి ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల పల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.  ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అలాగే బంగాళాఖాతంలో మయన్మార్‌కి దగ్గర్లో ఓ ఆవర్తనం ఏర్పడిందని.. అది రెండు రోజుల్లో అల్పపీడనంగా మారనుందని చెప్పారు. ఆ తర్వాత వాయుగుండంగా అయ్యే అవకాశం క డా ఉందని… దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని చెప్పారు.

ఆగస్టు నెలలో దాదాపు వేసవిని తలపించేలా వాతావరణం ఉన్నప్పటికీ.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి కురిసిన వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తరచుగా కురుస్తున్నాయి.

You may also like

Leave a Comment