పన్నెండేళ్ల తర్వాత భారత జట్టు సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడనుండగా… భారత్ కు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఏచిన్న పొరపాటు జరగకుండా తగిన జాగర్తలు తీసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా పలువురు విశ్లేషకులు పలు సలహాలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత్ విజయం సాధించాలంటే ఏం జరగాలో దక్షిణాఫ్రికా(South Africa) లెజెండ్ ఏబీ డివిలియర్స్(AB de Villiers) ప్రోబబిలిటీ ప్లానింగ్ ఇచ్చాడు.ఇండియా వరల్డ్ కప్ నెగ్గడంపై ఇప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
సొంతగడ్డపై టీమ్ఇండియా(Team India)కు తిరుగు లేదని ఒకరు అంటుంటే.. ఈ సారి భారత్ అంత బలంగా లేదని మరికొందరు వాదిస్తున్నారు.ఈ క్రమంలో డెవిలియర్స్ చెప్పే సలహా ఏంటంటే..2023 వన్డే వరల్డ్ కప్(World Cup)లో భారత్ విజయం సాధించాలంటే..కోహ్లీ ఏం చేయగలడో.. అది చేసి చూపించాలి’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున సుదీర్ఘ కాలం కోహ్లీతో కలిసి ఆడిన డివిలియర్స్.. అతడి ప్రతిభపై తనకు అపార నమ్మకముందని గతంలోనూ పలుమార్లు వెల్లడించాడు. వీరిద్దరి మధ్య సోదర ప్రేమ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు
స్వదేశంలో మెగాటోర్నీ జరగనుండటం భారత్కు కలిసొచ్చే అంశం కాగా.. పరుగుల యంత్రం, చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే టీమిండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ ముద్దాడుతుందని ఏబీడీ అభిప్రాయపడ్డాడు.
ఇక నేటితో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి పదిహేనేండ్లు పూర్తి చేసుకున్న కోహ్లీ.. తన అరంగేట్రం తర్వాత వన్డే క్రికెట్లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.