Telugu News » Mind game : మీ బ్రెయిన్ ని 70 ఏళ్లకు తగ్గించాం..!

Mind game : మీ బ్రెయిన్ ని 70 ఏళ్లకు తగ్గించాం..!

మానవుడి మెదడు(brain)కి ఆలోచించే శక్తి ఉండడం వల్ల జంతువు కంటే ఎంతో మెరుగ్గా జీవించగలుగుతున్నాడు.

by sai krishna

మానవుడి మెదడు(brain)కి ఆలోచించే శక్తి ఉండడం వల్ల జంతువు కంటే ఎంతో మెరుగ్గా జీవించగలుగుతున్నాడు. అదే ఆలోచనతో మానవ మెదడు మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు.


లేటెస్ట్ గా మెదడు వయసును తగ్గించే దిశగా అమెరికా(America) , ఆస్ట్రేలియా(Australia) శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. మెదడు వయసును దశాబ్దాల వరకు తగ్గించే ప్రక్రియలో విజయవంతమయ్యారు.


అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా(University of California), శాన్‌ ఫ్రాన్సిస్కో (యూసీఎస్‌ఎఫ్‌), యూనివర్సిటీ ఆఫ్‌ శాస్త్రవేత్త(University of Scientist)లు ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఇందుకు గానూ 2 ఏండ్ల ఎలుకలను ఎంచుకున్నారు.

ఈ వయసు ఎలుకలు మానవుల 70 ఏండ్లకు సమానం. ఎలుకలు వృద్ధాప్యానికి వాటి రక్తంలో ఓ జన్యువు కారణమని పరిశోధకులు గుర్తించారు. ప్లేట్‌లెట్‌ ఫ్యాక్టర్‌ (పీఎఫ్‌)-4 అనే ప్రొటీన్‌తో మెదడు వయసును తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఎలుకలకు ఈ ప్రొటీన్‌ను అందించారు.

దీని ప్రభావంతో వృద్ధాప్యంలో ఉన్న ఎలుకలు మధ్య వయసుకు చేరుకున్నాయి. అదే సమయంలో యువ ఎలుకల మెదడు పనితీరు స్మార్ట్‌గా మారినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు మానవులపై కూడా పని చేస్తాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు

You may also like

Leave a Comment