Telugu News » Dirty driver : యువతిని కారు బానెట్ పై ఈడ్చుకెళ్లిన ఓ డ్రైవర్ దుర్మార్గం..!

Dirty driver : యువతిని కారు బానెట్ పై ఈడ్చుకెళ్లిన ఓ డ్రైవర్ దుర్మార్గం..!

ఓ డ్రైవర్ మూర్ఖమైన చర్యకు ఒక యువతిని ప్రాణాపాయంలో పడేసింది.ఆ కారు డ్రైవర్ తన కారును రాంగ్ సైడ్లో డివైడర్( Divider)దాటేందుకు ప్రయత్నించగా అది చూసిన యువతి ఆ కారును అడ్డగించింది.

by sai krishna

ఓ డ్రైవర్ మూర్ఖమైన చర్య ఒక యువతిని ప్రాణాపాయంలో పడేసింది.ఆ కారు డ్రైవర్ తన కారును రాంగ్ సైడ్లో డివైడర్( Divider)దాటేందుకు ప్రయత్నించగా అది చూసిన యువతి ఆ కారును అడ్డగించింది.దీంతో రెచ్చిపోయిన సదరు డ్రైవర్ కారు బానెట్(Bonnet)పై యువతిని ఈడ్చుకెళ్లాడు.


ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ(CCTV) కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే…జంక్షన్ పోలీస్ స్టేషన్( Junction Police Station) పరిధిలో రాంగ్ రూట్ లో వస్తున్న కారును అడ్డగించిన సమయంలో కారు యువతి పైకి వెళ్లింది.

యువతి కేకలు వేస్తూ బానెట్పై వేలాడుతున్నా… దుర్మార్గంగా కారును పోనిచ్చాడు డ్రైవర్. దీంతో యువతిని రక్షించడానికి స్థానికులు కారు వెంట పరుగులు తీశారు. అయినా దుండగుడు కారు ఆపలేదు. ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా…పోలీసుల దృష్టికి వెళ్లింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కారును గుర్తించామని జంక్షన్ స్టేషన్ ఇంఛార్జ్ విష్ణు ఖత్రి(Vishnu Khatri)తెలిపారు.అయితే ఈ కేసులో దర్యాప్తు చేపట్టినప్పటికీ బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.

You may also like

Leave a Comment