ఒడిశా(Odessa)లోని గంజామ్(Ganjam) జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. కరెంట్ బిల్ ఎక్కవ వచ్చిందని..మీటర్ రీడింగ్ తీసే వ్యక్తిని వెంటాడి వెంటాడి మరీ చంపారు.ఈ దుర్ఘటన స్థానికంగా సంచలం రేపింది.
పోలీసుల సమాచారం ప్రకారం గ్యాలరీ గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి అనే విద్యుత్ ఉద్యోగి.. కరెంట్ మీటర్ల రీడింగ్ కోసం కుపాటి(Kupati)అనే గ్రామానికి వెళ్లాడు.
ఈ క్రమంలో కొంత మంది ఆగంతుకులు అతడ్ని వెంబడించారు.వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న త్రిపాఠి..అనంతరం ఓ ఇంటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీస్తున్నాడు. అదే సమయంలో ఆగంతుకులు కూడా అక్కడకు వచ్చారు.
ఆ గుంపులో నుంచి వచ్చిన ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో త్రిపాఠీపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ త్రిపాఠి..అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెంటనే ఘటనా స్థలం నుంచి నిందితుడు పరారయ్యాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న త్రిపాఠి మృతదేహాన్ని గమనించిన గ్రామస్థులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. “త్రిపాఠి ఎలాంటి తప్పు చేయలేదు.
అతణ్ని అన్యాయంగా హత్య చేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.” అని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనపై మీటర్ రీడర్ ఉద్యోగుల సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.