Telugu News » Mega Speech: రీమేక్ చేస్తే తప్పేంటి..!? ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా..నచ్చితేనే చూస్తా..!?

Mega Speech: రీమేక్ చేస్తే తప్పేంటి..!? ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా..నచ్చితేనే చూస్తా..!?

ఎవర్ గ్రీన్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన రీసెంట్ మూవీ భోళాశంకర్...మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్నఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

by sai krishna

ఎవర్ గ్రీన్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన రీసెంట్ మూవీ భోళాశంకర్…మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్నఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

మెగాస్టార్ మూవీ ఈవెంట్ అంటే మామూలుగా ఉంటుందా..! పలువురి సినీ ప్రముఖులు, అభిమానులతో కళకళలాడింది..ఫ్యాన్స్ ఉత్సాహం,హంగామాల మధ్య ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

అయితే చిరంజీవి మాట్లాడుతూ రీమేక్ సినిమాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.అసలు రీమేక్ సినిమాలు చేస్తే తప్పేంటి..!? వేరే భాషలోని అద్భుతమైన కంటెంట్ మనవాళ్లకు అందించే ప్రయత్నం చేస్తే తప్పేంటి.!? అన్నారు చిరు.

‘భోళాశంకర్’ సినిమా వేదాలం(vedalam) అనే తమిళ సినిమాకు రీమేక్ అని. ప్రస్తుతం ఆ సినిమా ఏఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ అందుబాటులో లేదు. చాలా మంది ఇప్పటికీ ఈ సినిమా చూసి ఉండరు.

ఆ ధైర్యంతోనే ఈ సినిమా చేశాను.  ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందన్నారు. ఈ సంధర్భంగా ఖైదీ నంబర్ 156 చిత్రంలోని డైలాగ్ ను ప్రస్తావిస్తూ “ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా..నాకు నచ్చితేనే చూస్తా’’ అంటూ భవిష్యత్ లో తాను చేయబోయే రీమేక్ సినిమాల కూడా ఇప్పుడే హింటిచ్చారు మెగాస్టార్.

ఈ సినిమా సెట్ కి వెళ్లినప్పుడు ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం అందరిలో కనిపించిందన్నారు. భోళా శంకర్లో నేను కనిపించను. తమ్ముడు పవన్ కల్యాణ్ కనిపిస్తాడు. ఆడియెన్స్కు అది కనులపండుగగా ఉంటుంది. ఇందులో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ బాగుంటుంది.

కీర్తి సురేశ్ కూడా బాగా నటించారు. నన్ను ప్రోత్సహంచి ఈ స్థాయిలో నిలబెట్టిన ఫ్యాన్స్కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా” అని మెగాస్టార్ అన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇండస్ట్రీ ఒకరి సొత్తుకాదని.. ప్రతిభకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుందన్నారు.

“కేవలం స్టార్స్‌ మాత్రమే ఉన్న ఇండస్ట్రీలోకి బిక్కుబిక్కుమనుకుంటూ ప్రవేశించా. కానీ, ఇక్కడ రాణిస్తాననే నమ్మకం గట్టిగా ఉండేది. ‘కొత్త అల్లుడు’లో ఓ చిన్న పాత్ర పోషించమన్నారు. బాధతోనే నటించా.

‘కొత్తపేట రౌడీ’లో కృష్ణగారి పక్కన చిన్న వేషం వెయ్యవయ్యా’ అని అనేవారు. ఓ వైపు నేను ‘ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య’, ‘శుభలేఖ’ చేస్తున్నానని, వేరే సినిమాల్లో చిన్న పాత్రలు పోషిస్తే బాగోదేమోనన్న సందేహం వెలిబుచ్చా. ‘చేయండి సర్‌’ అంటూ గంభీర స్వరంతో సమాధానమిచ్చేవారు.

చెయ్యను అని చెబితే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోననే భయంతో చేశా. నన్ను ప్రోత్సహించి, భుజానికెత్తుకుంది ప్రేక్షకులు. ఇండస్ట్రీకి చెందిన వారు నాకు సెకండరీ” అని చిరంజీవి భావోద్వేగంగా మాట్లాడారు.

ఈ వేడుకకు హాజరైన ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ ( Allu Aravind) మాట్లాడుతూ…అందరూ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగితే…నేను మాత్రం ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగా. ఆయనంటే నాకెంతో ఇష్టం.

ఒకరు ఆయన గురించి తప్పుగా మాట్లాడినందుకు..12 ఏళ్లు పోరాడి వారికి శిక్ష పడేదాకా నేను ఊరుకోలేదు” అని అన్నారు. కాగా ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ కీలక పాత్ర పోషించారు. నటి కీర్తి సురేశ్..చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించగా.. తమన్నా భాటియా మెగాస్టార్తో జత కట్టారు.

‘భోళా శంకర్’ను దర్శకుడు మెహర్ రమేశ్ తమిళ సినిమా ‘వేదాలం’ను రీమేక్ చేసి తెలుగులో తెరకెక్కించారు. ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర, రామారావు ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

You may also like

Leave a Comment