Telugu News » Jungle jilebi: మానవాళికి మేలుచేసే మిరాకిల్ ఫ్రూట్..సీమ చింతకాయ్..!

Jungle jilebi: మానవాళికి మేలుచేసే మిరాకిల్ ఫ్రూట్..సీమ చింతకాయ్..!

సీజనల్ ఫ్రూట్స్(seasonal fruits) వేటికవే ప్రత్యేకం. ఆయాకాలాల్లో అవి చేకూర్చే ప్రయోజనాలు కూడా అద్భుతం. అలాంటి వాటిల్లో సీమ చింతకాయలు చెప్పుకోతగ్గవి.

by sai krishna

సీజనల్ ఫ్రూట్స్(seasonal fruits) వేటికవే ప్రత్యేకం. ఆయాకాలాల్లో అవి చేకూర్చే ప్రయోజనాలు కూడా అద్భుతం. అలాంటి వాటిల్లో సీమ చింతకాయలు చెప్పుకోతగ్గవి. ఇవి వర్షాకాలంలో రెండు నుంచి మూడు నెలలు దొరుకుతాయి.

ఈఫలాలు కలిగించే ఉపయోగాల దృష్ట్యా ఆధూనిక పరిశోధకులు సీమ చింత చెట్టుని మిరాకిల్ ట్రీ(Miracle tree) అని అభివర్ణించారంటే ఈ చెట్టు ఎంత గొప్పదో వాటి ఫలాలు ఎలాంటి ఔషదాలో అర్థం చేసుకోవచ్చు.

ఇవి ఒకప్పుడు సీమ చింతలు పల్లెటూళ్లలో ఎక్కువగా లభించేవి. ఇప్పుడు పట్టణాల్లోనూ పండ్ల మార్కెట్లు, అక్కడక్కడా తోపుడు బండ్లపై అమ్మకానికి కనిపిస్తున్నాయి.

అలా మీకు కూడా ఇవి గనుక కనిపిస్తే..అస్సలు మిస్ చేయకుండా తినండి. తీపి, వగరు రుచిని కలిగి ఉండే ఈ సీమ చింతకాయలను తినడం వల్ల ఆరోగ్యకరమైన లాభాలు చాలా ఉన్నాయి.

ఇంతకీ లాభాలేంటో చూద్దాం. సీమ చింతకాయలు రుచికి తీపి, వగరుగా ఉంటాయి. చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. సీమ చింతకాయలను జంగిల్ జిలేబి అని కూడా పిలుస్తారు. మధ్య వేసవి కాలం నుంచి వర్షాకాలం ముగిసేవరకూ లభించే ఈ కాయల్లో పీచు పదార్థం, ప్రొటీన్లు ఎక్కువగా..కొవ్వులు తక్కువగా ఉంటాయి.

సీమ చింతకాయల్లో విటమిన్లు B1, B6, A, C కూడా ఉంటాయి. విటమిన్ C శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి.సీమ చింతకాయలు తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు అందుతాయి.

అలాగే వీటిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. సీజనల్ గా లభించే సీమ చింతకాయలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.ఎక్కువసేపు నమిలి తింటాం కాబట్టి దంతాలు కూడా శుభ్రపడతాయి.

గర్భిణీ స్త్రీలు, బాలింతలకు సీమ చింతకాయలు సరైన పోషకాహారం. గర్భిణీ స్త్రీలలో మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. సీమ చింతకాయలు తినడం వల్ల నాడీమండల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.రక్తనాళాలు కూడా చక్కగా పనిచేస్తాయి.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. కంటిచూపును పెంచుతాయి.బరువు తగ్గాలనుకునేవారికి.. సీమచింతకాయలు మంచి స్నాక్. ఇవి తింటే కడుపునిండిన భావన కలిగి చిరుతిళ్లు తినాలన్న కోరిక తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని(sugar levels ) అదుపులో ఉంచడంతో పాటు.. ఒత్తిడి, ఆందోళన సమస్యల్ని కూడా తగ్గిస్తాయి.

You may also like

Leave a Comment