సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎన్టీఆర్ అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో పాపులర్ అయిపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు చెరగని ముద్ర వేసుకున్నారు. పౌరాణిక, సాంఘిక, జానపద సినిమాల్లో నటించి ఎంతోమంది ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకున్నారు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. విలక్షణమైన తన నటనతో నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు ఎన్టీఆర్. తెలుగు హీరో అయినా అప్పట్లోనే ఆయన దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. సినిమాల తర్వాత ఆయన రాజకీయాల్లోకి కూడా వచ్చారు.
రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే సీఎం అయ్యారు. సీఎం గా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి తెలుగు ప్రజలకి సేవ చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చారు బాలయ్య తర్వాత అంత క్రేజ్ ని సంపాదించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. నటనలో తాతకి తగ్గ మనవడు అనిపించుకోవడంతో బాలయ్య కంటే ఎన్టీఆర్ కి ఎక్కువ క్రేజ్ వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకుంటారని ఎన్టీఆర్ ముందే ఊహించారు.
Also read:
ఎన్టీఆర్ కి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అబిడ్స్ లో ఎన్టీఆర్ దగ్గరికి హరికృష్ణ తీసుకువెళ్లాడు అప్పుడు ఎన్టీరామారావు దగ్గరికి తీసుకుని నీ పేరేంటి అని అడిగితే తారక్ రామ అని చెప్పాడు. దాంతో హరికృష్ణ ని పేరు తారక రామని ఎందుకు పెట్టావ్ అని అడగ్గా అమ్మ పేరు రాముడు పేరు కలుస్తుందని అలా పెట్టానని చెప్పాడు. నా మనవడు నా పోలికలతో ఉన్నాడు. పైగా గొప్పవాడు అవుతాడు అని నందమూరి తారక రామారావు గా పేరు మార్చేశారు ఇక ఎన్టీ రామారావు ఊహించినట్లే స్టార్ హీరో అయ్యారు జూనియర్ ఎన్టీఆర్