Telugu News » Srisailam : శ్రీశైల క్షేత్రంలో అన్యమతస్తుల ఆగడాలు..!

Srisailam : శ్రీశైల క్షేత్రంలో అన్యమతస్తుల ఆగడాలు..!

భారతదేశంపై దండెత్తిన ఎంతోమంది విదేశీయుల నుంచి ధార్మిక వ్యవస్థను రక్షించుకునే క్రమంలో ఎందరో హిందువులు ప్రాణాలు ధారపోశారు. వారి త్యాగాలకు ఇప్పుడు అర్థం లేకుండా పోతోందని అంటున్నాయి హిందూ సంస్థలు. ఒకవైపు మత మార్పిడులు వచ్చిలవిడిగా సాగుతున్నాయి.. ఇంకోవైపు అత్యంత పవిత్రంగా భావించే హిందూధార్మిక సంస్థలపై దాడులు జరుగుతున్నాయని మండిపడుతున్నాయి.

by admin

– ధార్మిక క్షేత్రాలపై కుట్రలు
– హిందువులకు ఆలయాలను దూరం చేసే కుతంత్రాలు
– శ్రీశైల క్షేత్రంలో రెచ్చిపోతున్న అన్యమతస్తులు
– ముస్లింలకు షాపులు ఇచ్చే ప్రయత్నాలు
– నిలదీసిన వారిపై విచ్చలవిడిగా దాడులు
– ఇదంతా ఎమ్మెల్యే అండదండలతోనే జరుగుతోందా!
– హిందూ సంస్థలు ఏమంటున్నాయి..?

శ్రీశైలం.. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా నిత్యం భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి, సంక్రాంతి, ఉగాది, కార్తికమాసం, మాఘమాసాల్లో వచ్చే పండుగల సమయంలో భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. కొండల్లో, లోయల్లో ప్రయాణించి, వేసవి మండుటెండల్లో కూడా భక్తిభావంతో శ్రీశైలం చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. మండల దీక్షలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అయితే.. శ్రీశైల క్షేత్రంలో కొన్నాళ్లుగా అన్యమతస్తుల ఆగడాలు మితిమీరిపోవడంతో భక్తులకు అసౌకర్యంగా మారిందని అంటున్నాయి హిందూ సంస్థలు.

srisailam

షాపుల నిర్మాణంతో గొడవ

శ్రీశైలం ఆలయానికి సమీపంలో ఉన్న మరుగుదొడ్లను తొలగించారు అధికారులు. వాటి స్థానంలో నూతనంగా షాపులు నిర్మిస్తున్నారు. అయితే.. ఈ షాపుల్లో కొన్నింటిని ముస్లింలకు కేటాయించాలని నిర్ణయించారు. ఇదే వివాదానికి కారణమైంది. ఇప్పటికే ఉన్న అన్యమస్తులతో తరచూ వివాదాలు చెలరేగుతుండగా.. ఇప్పుడు మరికొన్ని షాపులను వారికి కేటాయించడంపై హిందూ సంస్థలు అభ్యంతరం తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా బీజేపీ కార్యదర్శి అరవింద్ రెడ్డి అక్కడకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు.

attack-on-aravind-reddy-in-srisailam

అరవింద్ రెడ్డిపై పక్కా ప్లాన్ తో దాడి

శ్రీశైలంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు అరవింద్ రెడ్డి. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రంలో అన్యమతస్తులు ఉండకూడదని పోరాడుతున్నారు. అలాంటిది వారికి షాపులు కేటాయించడం ఏంటని న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. అయితే.. ఆయన అన్నపూర్ణాదేవి ఆశ్రమంలో ఉన్న సమయంలో కొంతమంది వచ్చి మాట్లాడాలని చెప్పి దాడికి పాల్పడ్డారు. శ్రీశైలంలో హిందువులను ఉండనివ్వం అని కేకలు వేస్తూ వెళ్లిపోయారు.

ఫిర్యాదు చేసినా సరైన చర్యలేవి?

తనపై జరిగిన దాడిని వివరిస్తూ.. శ్రీశైలం వన్ టౌన్ ఎస్సైకి అరవింద్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని అంటున్నారు ఆయన. మొత్తం ఆరుగురిపై ఫిర్యాదు చేస్తే.. ఐదుగుర్ని తప్పించి ఒక్కరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెబుతున్నారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేది లేదని.. దేవాదాయ సిబ్బందిపై, కమిషనర్ పై, స్థానిక పోలీసులపై నంద్యాల ఎస్పీకి, డీజీపీకి, సెంట్రల్ హోం మినిస్టర్ కి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగే అక్రమాలపై ధర్మ పోరాటం ఆగదని స్పష్టం చేశారు అరవింద్ రెడ్డి.

ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు

శ్రీశైలంలోని దుకాణాలు, హోటళ్లలో 90 శాతం ముస్లింలు, క్రైస్తవులే ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రఫీ అనే వ్యక్తి, వైసీపీ హయాంలో రజాక్‌ అనే వ్యక్తి ఇక్కడ తిష్టవేసి పెద్దసంఖ్యలో గ్రూపులను తయారుచేశారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి వీరి వెనుక ఉన్నారని హిందూ సంస్థల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా.. కొండపైకి మద్యం, మాంసం విచ్చలవిడిగా తీసుకొళ్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. అన్యమత ప్రచారం, మతమార్పిడే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయని హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. హిందూ ఆలయంలో ముస్లింలు, క్రైస్తవులు ఉండకూడదని అనడం కూడా తప్పనే పరిస్థితికి తీసుకొచ్చారని.. హిందువులు అందరూ అరవింద్ రెడ్డికి అండగా నిలవాలని సూచిస్తున్నాయి.

హిందూ ధర్మంపై దాడి

భారతదేశంపై దండెత్తిన ఎంతోమంది విదేశీయుల నుంచి ధార్మిక వ్యవస్థను రక్షించుకునే క్రమంలో ఎందరో హిందువులు ప్రాణాలు ధారపోశారు. వారి త్యాగాలకు ఇప్పుడు అర్థం లేకుండా పోతోందని అంటున్నాయి హిందూ సంస్థలు. ఒకవైపు మత మార్పిడులు వచ్చిలవిడిగా సాగుతున్నాయి.. ఇంకోవైపు అత్యంత పవిత్రంగా భావించే హిందూధార్మిక సంస్థలపై దాడులు జరుగుతున్నాయని మండిపడుతున్నాయి. దేవస్థానాలున్న ప్రాంతాల్లో ఉపాధి కోసం చేరుతున్న అన్యమతస్తులు.. హిందూ ధార్మిక విధానాలకు, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అపవిత్రం చేస్తున్నారని అంటున్నాయి. అంతేకాదు, కొన్నిచోట్ల రాజకీయ అండదండతో దేవస్థానాల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకొని నిర్వహణను తమకు అనువుగా మార్చుకుంటున్నారని చెబుతున్నాయి. ఆలయాలను అపవిత్రం చేసి హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయడమే కుట్రగా వీరు ముందుకు పోతున్నారని ఆరోపిస్తున్నాయి. వీరి దుర్మార్గాలకు అంతం పలకాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి హిందూ సంస్థలు.

You may also like

Leave a Comment