Telugu News » చంద్రబాబుపై ఇంకో కేసు.. ఈసారి ఇసుక కుంభకోణం…!

చంద్రబాబుపై ఇంకో కేసు.. ఈసారి ఇసుక కుంభకోణం…!

by Sravya
chandrababu open letter to people

స్కిల్ స్కామ్ లో చంద్రబాబుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబుపై ఇంకో కేసు కూడా నమోదు చేశారు చంద్రబాబు మీద వీలైనంత కేసులు పెట్టాలని వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. చంద్రబాబుని వైసిపి సర్కారు వెన్నాడుతోంది. స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ లభించిన కూడా జగన్ సర్కార్ మాత్రం వెనక్కి ఏమాత్రం తగ్గట్లేదు. వీలైనంత చంద్రబాబు మీద కేసులు పెట్టి ఇరికించాలని చూస్తోంది. తాజాగా ఆయనపై ఇసుక కుంభకోణం కేసు నమోదు అయింది. ఏపీఎండిసి ఫిర్యాదుతో సిఐడి కేసును నమోదు చేసింది. ఏ1 గా పీతల సుజాత.

ఏ2 చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ 4 దేవినేని ఉమా మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వ ఖనజాలకి తీవ్ర నష్టం కలిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ దాఖలు చేసింది ఈ క్రమంలోనే సిఐడి తాజాగా చంద్రబాబుపై కుంభకోణం కేసు నమోదు చేసింది. చంద్రబాబు అరోగ్య దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇచ్చిన తరుణంలో అరెస్టు చేయమని సిఐడి క్లియర్ గా చెప్పింది కోర్టు సైతం దీనిపై స్పష్టమైన ఆదేశాలని జారీ చేసింది.

Also read:

chandrababu

చంద్రబాబు హయాంలో ఇస్తారాజ్యం సరఫరా చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చి 1300 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు అన్నది ఆరోపణ దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తామని కోర్టు చెప్పింది. తాజాగా ఇసుక కుంభకోణం ఒకటి జరిగిందని వైసీపీ ప్రభుత్వం అంది. ఇప్పటికే తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని చంద్రబాబు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తీర్పుని న్యాయస్థానం రిజర్వులో పెట్టింది ఈ నెల ఎనిమిదిన తీర్పుని వెల్లడించనుంది. చంద్రబాబు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని వైసీపీ ప్లాన్ అని అర్థమవుతుంది ఇప్పటికే అనారోగ్య పరిస్థితులు దృశ్య మద్యంతర బెయిల్ దక్కడంతో చంద్రబాబుకి స్వల్ప ఉపశమనం వచ్చింది.

You may also like

Leave a Comment