నందమూరి కళ్యాణ్ రామ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్లలో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. నందమూరి కుటుంబం నుండి బాలయ్య, ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అంతటి పేరు తెచ్చుకున్న హీరో కళ్యాణ్ రామ్. ఒకపక్క సినిమాలను నిర్మిస్తూ ఇంకోపక్క హీరోగా కూడా రాణిస్తున్నారు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ ని కొట్టేశారు కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్.
సినిమాల గురించి పక్కన పెట్టేస్తే పర్సనల్ లైఫ్ గురించి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. కళ్యాణ్ రామ్ 2006 ఆగస్టు 10న స్వాతిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ మొదట స్వాతిని పెళ్లి చూపులప్పుడే చూశారు. స్వాతి ఒక డాక్టర్. స్వాతి కళ్యాణ్ రామ్ కి ఇద్దరు పిల్లలు .తారక అద్వైత, సౌర్య రామ.
Also read:
కళ్యాణ్ రామ్ సినిమాలని స్వాతి బాగా ఎంజాయ్ చేస్తుంది శతమానం భవతి సినిమా చూసి స్వాతి కళ్యాణ్ రామ్ ని ఇటువంటి సినిమా చేయొచ్చు కదా అని అన్నారట. అప్పుడే అన్ని రకాల పాత్రలు ఉండే సినిమాలు చేయాలని కళ్యాణ్ రామ్ అనుకున్నారట. ఎంబిబిఎస్ పూర్తి చేసిన స్వాతి విఎఫ్ఎక్స్ సంస్థని స్థాపించారు షార్ట్ ఫిలిమ్స్ కి సంబంధించి గ్రాఫిక్స్ ని సంస్థలు రూపొందిస్తారు ఈ విధంగా స్వాతి సినిమాలకి దగ్గరయ్యారు.