Telugu News » CPI : వెర్రోళ్ళు అవుతున్న ఎర్రన్నలు.. ప్రజాక్షేత్రంలో బలహీనంగా మారినట్టేనా..!!

CPI : వెర్రోళ్ళు అవుతున్న ఎర్రన్నలు.. ప్రజాక్షేత్రంలో బలహీనంగా మారినట్టేనా..!!

ఆశ అనేది గొలుసు లాంటిది.. దీనితో బంధించబడిన వారు, వేగంగా పరిగెత్తుతారు, కాని స్వేచ్ఛగా ఉన్నవారు, పక్షవాతంలా నిలబడి ఉంటారు. ప్రస్తుతం కమ్యునిస్టుల పరిస్థితి ఇదే అని మేధావులు అంటున్నారు.

by Venu
CPI in graduate MLC election ring..Congress's decision is your suspense!

కమ్యునిస్టులు ప్రత్యేకమైన భావజాలాలు కలిగిన వ్యక్తులుగా, సమాజం కోసం పోరాడే శక్తులుగా ఒకప్పుడు పేరు ఉండేది. కానీ నేడు కమ్యునిస్టుల ఆశావాదం వెనుక ప్రత్యేకమైన నిర్మాణాత్మక ఎజెండా ఏమీ లేదని అంటున్నారు.. రాజకీయంగా ఎదగాలనే ఆశ తప్పా.. ప్రజా సమస్యలపై పట్టింపులేదని ప్రచారం జరుగుతుంది. ఈ ఆశ అనేది గొలుసు లాంటిది.. దీనితో బంధించబడిన వారు, వేగంగా పరిగెత్తుతారు, కాని స్వేచ్ఛగా ఉన్నవారు, పక్షవాతంలా నిలబడి ఉంటారు.

ప్రస్తుతం కమ్యునిస్టుల పరిస్థితి ఇదే అని మేధావులు అంటున్నారు. అసలు వారిపై వారికే నమ్మకం ఉందా! అనే అనుమానం ప్రజల్లో ఉందని చెబుతున్నారు.. మరోవైపు వారికి ఉన్న బలంపై ఇతర పార్టీలకే నమ్మకం లేదు. కాలం కలిసి రావడం లేదని వారు అనుకుంటున్నారు. కానీ అది తప్పని మేధావి వర్గం వాదిస్తుంది. అందుకే కమ్యునిస్టు పార్టీలను అన్ని పార్టీలూ పక్కన పెడుతున్నాయని వారు అంటున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో దశాబ్ద కాలంగా కమ్యునిస్టు పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి.

పదేళ్ల నుంచి ఏపీ (AP)లో అయితే శాసనసభలో అడుగు పెట్టలేదు. ఈసారైనా కాలుమోపేందుకు టీడీపీతో జత కట్టడానికి కమ్యునిస్టు పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ టీడీపీ (TDP) జనసేన (Janasena)లతో బీజేపీ (BJP) కలిస్తే ఏపీలోనూ ఒంటరిగా కమ్యునిస్టులు పోటీ చేయాల్సిందే. ఇదే జరిగితే వారి బలమెంతో వారికి తెలుసు. అందుకే ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయరని అనుకుంటున్నారు.

తెలంగాణలో మరోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు కుదురుతుందని కామ్రేడ్లు ఎన్నో కలలు కన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తమ మద్దతును కేసీఆర్ స్వయంగా కోరుకోవడంతో కమ్యునిస్టులలో ఆశలు చిగురించాయి. వచ్చే ఎన్నికల్లో తాము చట్ట సభల్లోకి అడుగుపెడతామని ఆశపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలలో బేషరతుగా మద్దతిచ్చారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కమ్యునిస్టులను, కేసీఆర్ కన్నెత్తి చూడలేదన్న విషయం యావత్ రాష్ట్రమంతా తెలుసు..

అసెంబ్లీ ఎన్నికల వేళ అయితే కామ్రేడ్స్ ఎవరు అనే చందాగా కేసీఆర్ ప్రవర్తించారని గుసగుసలు కూడా వినిపించాయి. అదీగాక 119 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడంతో వామపక్ష పార్టీలు మరోసారి నిరాశకు గురయ్యారు. మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటం తగ్గించినందునే కామ్రేడ్లు ప్రజల్లో వీక్ అయపోయారన్నవాదన వినిపిస్తుంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ తో జతకడితే చాలు అన్న ధోరణితో వారు హస్తం పార్టీకి దగ్గరయ్యారని ప్రచారం జరుగుతుంది.. కానీ కాంగ్రెస్ మాత్రం చూద్దాంలే అనే తీరుగా వ్యవహరిస్తుందని తెలుస్తుంది.

ప్రస్తుతం సీపీఐ (CPI) పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల తయారైందని అనుకుంటున్నారు. కాగా కమ్యునిస్టులు ఒంటరిగా పోటీ చేసినా పెద్దగా ప్రమాదం లేదని భావించిన పార్టీలు వారిని పక్కన పెడుతున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో కమ్యునిస్టు పార్టీలకు ఉన్న మార్గం.. సొంతంగా బరిలోకి దిగడం. లేదా మళ్లీ వచ్చే ఎన్నికల వరకూ ఎదురు చూపులు చూడటం.. మొత్తానికి ప్రజాక్షేత్రంలో బలహీనంగా మారి వెర్రోళ్ళు అవుతున్న ఎర్రన్నలని కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన వ్యక్తులు బాధపడుతున్నారు..

You may also like

Leave a Comment