ఝార్ఖండ్ (Jharkhand)లో ఘోర ఘటన జరిగింది. ఆనందంగా జరిగిన పెళ్లి చూసుకుని వస్తున్న కుటుంబలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం తెల్లవారుజామున ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బగ్మారా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident).. ఐదుగురు వ్యక్తులు అక్కిడకక్కడే మరణించగా.. మరో ఇద్దరు చిన్నారులు గాయపడినట్టు సమాచారాం. ఇక స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నవంబర్ 17వ తేదీ రాత్రి మృతుల బంధువుల్లో ఒకరి పెళ్లికి వీళ్ళంతా హాజరై.. స్కార్పియో వాహనంలో తోరియాకు బయలుదేరారు. ఈ క్రమంలో వాహనం బగ్మారా ప్రాంతానికి రాగానే డ్రైవర్.. వాహనంపై నియంత్రణ కోల్పాయాడు. దీంతో ఆ ఒక్కసారిగా వాహనం.. చెట్టును ఢీకొట్టింది. కాగా స్పాట్ లోనే ఐదుగురు మరణించినట్టు (Five people died).. మరో ఏడుగురు గాయపడినట్టు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ ప్రమదాన్ని గమనించిన స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని, అధికారులకు సమాచారం అందించారు. వాహనంలో ఉన్న వ్యక్తులను బయటకు తీశారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు.

బస్తీ ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇచ్చే దమ్ము కేసీఆర్ (KCR)కి లేదు కానీ గుడిసెలు వేసుకున్న వారి దగ్గర భూములు లాక్కొని పెద్దవాళ్ళకు కట్టబెడుతున్నారని ఈటల మండిపడ్డారు.. ఆనాటి ప్రభుత్వాలు ఎల్లమ్మబండలో ఉన్న 250 ఎకరాలలో 160 ఎకరాలు పేదలకు పంచాయి. మిగిలిన 92 ఎకరాలలో దేశ్ పాండే అనేవాడు రేకులు పాతే ప్రయత్నం చేసిండు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నేను రేకులు పీకేసి ఇది ప్రభుత్వ భూమి నువ్వు ఎవడ్రా అంటూ అతన్ని అడ్డుకున్నానని ఈటల తెలిపారు.



