Telugu News » Atchannaidu : అరాచక పాలన వెలగబెడుతున్న ప్రభుత్వం.. కేసులకు భయపడం..!!

Atchannaidu : అరాచక పాలన వెలగబెడుతున్న ప్రభుత్వం.. కేసులకు భయపడం..!!

ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

by Venu
atchannaidu

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో టీడీపీ (TDP) నాయకులపై పోలీస్ కేసుల పరంపర కొనసాగుతోంది. చంద్రబాబు (Chandrababu) నాయుడు, ఆయన తనయకుడు లోకేష్ (Lokesh)తో సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు, కార్యకర్తలపై అనేక కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అదీగాక బాబుతో పాటు కొందరు ప్రతిపక్ష నాయకులపై కేసులతో సరిపెట్టుకోలేదు.. వారిని జైల్లో కూడా పెట్టింది వైసీపీ ప్రభుత్వం అని ఆరోపణలు కూడా వచ్చాయి.

మరోవైపు టీడీపీ నేతలు ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు చర్యలను ఖండిస్తూ.. జగన్ సర్కార్ కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మరో నేతపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. టీడీపీ సీనియర్ నాయకుడు, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Narendra Kumar)పై చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.

సంగం డెయిరీ వద్ద తనపై దాడి జరిగిందంటూ ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంకు చెందిన రాము ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులపై.. ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ నేతలపై నాలుగున్నరేళ్లుగా వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు, ఇంకా కేసులు పెట్టి ఏం పీకుతారు ? అంటూ అచ్చెన్నాయుడు ఫైర్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కన్నా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉందంటూ ఆరోపించారు.. అరాచక పాలన వెలగబెడుతున్న జగన్ ఇలా కేసులతో భయపెట్టి నోర్లు మూయించలేరని మండిపడ్డారు..

You may also like

Leave a Comment