Telugu News » modi birthday : మోడీ బర్త్ డే ఆఫర్….. ఆటో ప్రయాణికులకు 30శాతం డిస్కౌంట్…!

modi birthday : మోడీ బర్త్ డే ఆఫర్….. ఆటో ప్రయాణికులకు 30శాతం డిస్కౌంట్…!

గుజరాత్ లోని ఆటో డ్రైవర్లు(Auto drivers) ప్రధాని మోడీపై(Pm modi) తమ అభిమానాన్ని చాటుకున్నారు.

by Ramu
Auto drivers in Surat to extend special discounts to passengers on the occasion

గుజరాత్ లోని ఆటో డ్రైవర్లు(Auto drivers) ప్రధాని మోడీపై(Pm modi) తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రధాని జన్మదినం(Birth day) సందర్భంగా సూరత్ కు చెందిన ఆటో డ్రైవర్లు ప్రయాణికులకు ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించారు. సుమారు వేయి మంది ఆటో డ్రైవర్లు తమ కస్టమర్లకు ఈ రోజు డిస్కౌంట్ ఇచ్చారు. ఈ వార్తను గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ షేర్ చేశారు.

Auto drivers in Surat to extend special discounts to passengers on the occasion

1,000 మంది ఆటో డ్రైవర్లు ఈ రోజు ప్రయాణికులకు 30 శాతం తగ్గింపును అందజేశారని ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ వెల్లడించారు. మోడీ 73వ పుట్టిన రోజు సందర్బంగా 73 మంది ఆటో డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందించి ఈరోజు తమ ప్రయాణీకులకు ఉచిత రైడ్‌లను అందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. నేటి నుంచి రెండు వారాల పాటు ‘సేవా పక్వారా’ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సేవా కార్యక్రమాలు, పరిశుభ్రత, అనాధ శరణాలయాలకు డొనేషన్స్ ఇవ్వడం లాంటి కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఇది ఇలా వుంటే విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఈ రోజు చేతి వృత్తుల వారి కోసం ‘విశ్వకర్మ’పథకాన్ని ప్రారంభించారు. దీంతో పాటు ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 21 నుంచి 25 వరకు పొడిగించిన ఢిల్లీ ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్ ప్రెస్ లైన్‌ను ప్రధాని మోడీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మెట్రోలో మోడీ ప్రయాణించారు.

You may also like

Leave a Comment