అయోధ్య(Ayodhya)లో బాలరాముడు కొలువుదీరాడు. కొన్నేళ్లుగా కోట్లాది మంది భారతీయులు ఎదురుచూసిన ఈ బృహత్తర కార్యం పూర్తయింది. దీంతో దేశమంతా సంబురాల్లో మునిగితేలుతోంది. అయితే రామమందిర నిర్మాణం పూర్తవడానికి ఎంతో మంది భక్తులు భారీగా విరాళాలు (Donations) అందజేశారు.
దేశవ్యాప్తంగా 20 లక్షల మంది కార్యకర్తలు 12 కోట్ల కుటుంబాల నుంచి రూ.2వేల కోట్లకు పైగా విరాళాలు సేకరించారని విశ్వహిందూ పరిషత్ లెక్కలు చెబుతున్నాయి. అందులో ఓ భక్తుడు ఏకంగా 101కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్‌వి లాఖి ఆ మొత్తాన్ని అందజేశాడు.
సుమారు 101 కిలోల బంగారాన్ని అయోధ్య రామమందిరానికి ఆయన కుటుంబం విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తం బంగారం విలువ ఇప్పటి మార్కెట్ విలువను బట్టి రూ.68కోట్లు ఉంటుంది. రామ మందిర ట్రస్టుకు వచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి రామ మందిరం కోసం రూ.కోటి ఇవ్వాలని నిర్ణయించుకుని ఏకంగా తన 16ఎకరాల పొలాన్ని అమ్మేశాడు. పొలాన్ని అమ్మేయగా ఇంకా రూ.15లక్షలు తక్కువ కావడంతో ఆ మొత్తాన్ని అప్పుగా తెచ్చిమరీ మొత్తం రూ.కోటి విరాళంగా అందజేశాడు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపూ 16 ఎకరాల పొలాన్ని అమ్మి మరీ విరాళం రూ.11కోట్లను రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద భాయ్ డోలాకియా రూ.11కోట్లు విరాళమిచ్చారు. అదేవిధంగా అమెరికా, కెనడా, బ్రిటన్‌లో నివాసముంటున్న రామ భక్తులు కలిసి రూ.8కోట్లు సమకూర్చారు.