అయోధ్య (Ayodhya) రామ మందిరానికి హైదరాబాద్ (Hyderabad) తలుపులను వినియోగిస్తున్నారు. సికింద్రబాద్ న్యూ బోయిన్ పల్లికి చెందిన అనురాధ టింబర్స్ ఇంటర్నేష్నల్ కంపెనీ వీటిని రూపొందిస్తోంది. రామ మందిరం, ఆలయ ప్రాంగణానికి అవసరమైన 100కు పైగా తలుపులను తామే తయారు చేస్తున్నామని సంస్థ యజమాని శరత్ బాబు వెల్లడించారు.
బల్లార్ష నుంచి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన టేకును ఈ తలుపుల తయారీలో వాడుతున్నట్టు వివరించారు. అందులోనూ అత్యంత నాణ్యత కలిగిన కలపను ఉపయోగిస్తున్నామని చెప్పారు. తలుపులపై అత్యంత అందమైన శిల్పాలను నిపుణులైన కళాకారులు కష్టపడుతున్నారని అన్నారు. ఈ తలుపుల కోసం కళాకారులు రేయింబవళ్లు కష్టడుతున్నారని వెల్లడించారు.
రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో పనిలో వేగాన్ని పెంచామన్నారు. ఈ అవకాశం తమకు దక్కడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామన్నారు. త్వరలోనే ఈ తలుపులను ఆలయ అధికారులకు అందజేస్తామన్నారు. ఇది ఇలా వుంటే రామ మందిరంలో శిల్ప కళ చాలా బాగుందని స్థానికులు చెబుతున్నారు.
ఇది ఇలా వుంటే జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ పనుల వేగం పెరిగింది. జనవరి 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్టను నిర్వహించనున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు మంచి ముహూర్తం ఉందని జ్యోతిష్యులు జ్యోతిషులు వివరించారు. 84 సెకన్ల పాటు శుభగడియలు ఉన్నాయని వెల్లడించారు.