తెలుగుదేశం, జనసేన పార్టీల ఆత్మీయ కలయిక కొత్త శకానికి నాంది అని హిందూపురం ఎమ్మెల్యే, అగ్రనటుడు బాలకృష్ణ(Balakrishna) అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ(TDP), జనసేన(Janasena) ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని బాలకృష్ణ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాలుగున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం అని నందమూరి బాలకృష్ణ అన్నారు. వైసీపీ పాలనలో నేరస్థులు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు.
తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీచేయడాన్ని రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారని నందమూరి బాలకృష్ణ అన్నారు. వైసీపీ అరాచకపాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఈ సమ్మేళనానికి ముందు బాలయ్య హిందూపురం మండలం అప్పలకుంటలో టీడీపీ నాయకుల ఇంట జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.