గణష్ నవరాత్రులు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అంతా ఆసక్తిగా ఎదురు చూసే బాలాపూర్ గణేష్ లడ్డూ (Balapur Laddu) వేలంలో రూ. 27 లక్షలు పలికింది. ఈ లడ్డూని దక్కించుకునేందుకు 36 మంది వేలంలో (Auction) పోటీ పడగా…దాసరి దయానంద్ అనే వ్యక్తి బాలాపూర్ లడ్డూని సొంతం చేసుకున్నారు. గతేడాది ఈ లడ్డూ రూ. 24.60 లక్షలు పలికింది. బాలాపూర్ లో లడ్డూ వేలం ప్రారంభమై ఈ ఏడాదికి 30 ఏళ్లు (30 years) పూర్తికావడం మరో విశేషం.
ఇదే కాకుండా చాలా చోట్ల గణనాధుడి లడ్డూలు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నాయి. కొన్ని చోట్ల లక్షలు, కోట్లు పలుకుతున్నాయి. నవరాత్రులు గణనాధుడితో పాటు పూజలందుకున్న ప్రసాదానికి విపరీతమైన క్రేజ్ పెరుగుతూ వస్తోంది. తాజాగా హైదరాబాద్ లో పలికిన రికార్డ్ ధరలే ఇందుకు నిదర్శనం.
ఈ ఏఢాది హైదరాబాద్ బండ్లగూడ పరిధిలోని (Bandllaguda) రిచ్‌మండ్ విల్లాలో గణనాథుడి లడ్డూ రూ.కోటి 20 లక్షలు పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా…గణపతి లడ్డూ రూ. కోటి 20 లక్షలు పలికింది. గతంలో కూడా ఇక్కడ గణపతి లడ్డు రూ. 60.80 లక్షలు పలికింది. అయితే ఈసారి మాత్రం అంతకు రెండింతలు ధర పలకడం గమనార్హం. 2021లో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రూ. 41 లక్షలు పలికింది.
అలాగే మదాపూర్ లోని మైహోమ్ భుజాలోని గణేశుని లడ్డూని రూ. 25 లక్షల 50 వేలకు చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. గతేడాది కంటే రూ.7 లక్షలు అధికంగా ధర పలికింది. 2022లో రూ.18.50 లక్షలు పలికిన విషయం తెలిసిందే. ఇలా ఏటా గణనాధుడి లడ్డూకి డిమాండ్ పెరగడంతో వేలంలో భక్తులు ఎంతైనా పెట్టి సొంతం చేసుకోవాలని చేస్తున్నారు. ఏటా గణనాధుడి లడ్డూ ప్రసాదానికి పెరుగుతున్న క్రేజ్ తో వేలంలో కూడా ఊహించని ధరలు పలుకుతున్నాయి.