Telugu News » BANDI SANJAY : రైతు దీక్షపై బండి సంజయ్ క్లారిటీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు!

BANDI SANJAY : రైతు దీక్షపై బండి సంజయ్ క్లారిటీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు!

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్నఅంశం దొరికిన దానిని క్యాష్ చేసుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి.

by Sai
Bandi Sanjay Clarity on Rythu Diksha.. Harsh comments on BRS and Congress party!

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్నఅంశం దొరికిన దానిని క్యాష్ చేసుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ వచ్చే ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Bandi Sanjay Clarity on Rythu Diksha.. Harsh comments on BRS and Congress party!

 

అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాగు నీటి కటకట కారణంగా పంటలు ఎండిపోతున్నాయి.ఈ క్రమంలోనే అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్న క్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Mp bandi sanjay) రైతు దీక్ష(Raithu Deeksha) చేపట్టాలని నిర్ణయించారు. కాగా, బండి ప్రకటనపై కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికోసమే బండి రైతు దీక్ష చేస్తున్నారని విమర్శించడంతో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ దానిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్నికల కోసం రైతు దీక్ష చేయడం లేదని, రైతులకు భరోసా కల్పించేందుకే రైతు దీక్ష చేపడుతున్నట్లు స్పష్టంచేశారు.

ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎండిన పంటలను పరిశీలించారు. ఈనెల 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు.దీనిపై బండి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కేసీఆర్ రైతులకు పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ కరీంనగర్(Karim Nagar)లో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా రేవంత్ సర్కార్ కుంటి సాకులు చెబుతోందని ఫైర్ అయ్యారు.మొదటి నుంచి రైతులకు బీజేపీనే అండగా ఉందని తెలిపారు.

 

You may also like

Leave a Comment