తెలంగాణ రాజకీయాల్లో త్రిముఖ పోరు చాలా ఆసక్తిగా మారిందని అంతా భావిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ (Congress).. బీఆర్ఎస్ (BRS) మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో కొంత విరామం ఇవ్వడానికి బీజేపీ వచ్చిందని భావిస్తున్నారు.. కాగా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక బండి సంజయ్ మాటల శబ్ధాలు ప్రచారంలో పెద్దగా వినపడటం లేదని బాధపడుచున్నారు అభిమానులు.. వారిని ఉత్సాహ పరచడానికి బరిలోకి దిగారు బండి సంజయ్..
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పై మాటల తూటాలు పేల్చారు బండి సంజయ్ (Bandi Sanjay)..ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు మంత్రి గంగుల కమాలాకర్ లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలను నమ్ముకున్నాడని ఆరోపించారు.. ఇక కరీంనగర్ (Karimnagar) కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడి సమస్యలపై అసలే అవగాహనే లేదని ఎద్దేవా చేశారు బండి సంజయ్. ప్రజల పట్ల చిత్త శుద్ధి లేని బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటుతో బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు.
కరీంనగర్ లో సీఎం కేసీఆర్ (KCR) సభ పెట్టుకున్నది తనను తిట్టడానికేనని విమర్శించిన బండి సంజయ్.. కరీంనగర్ వచ్చిన కేసీఆర్ ఇక్కడి అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.. ప్రజల కోసం పోరాడి జైలుకు పోయిన చరిత్ర తనదని.. న్యాయాన్ని రక్షించడానికి పోరాడే వారికి మీరు ఓట్లు వేయకుంటే.. పేదల పక్షాన పోరాడేవాళ్లు వెనుకంజ వేస్తారన్నారని తెలిపారు బండి సంజయ్..
అవినీతి ప్రభుత్వం పై కొట్లాడితే కేసీఆర్ తనకు ఇచ్చిన గిఫ్ట్ 74 కేసులని చెప్పుకొచ్చారు. అన్నింటికీ తెగించి.. నా కుటుంబాన్ని పక్కన పెట్టి పాతబస్తీలో సభ పెడితే తనను బెదిరించారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్న ఇలాంటి వారిని మరోసారి గెలిపిస్తే ఒంటి మీది గుడ్డలు కూడా లాక్కుంటారని బండి సంజయ్ మండిపడ్డారు..