ప్రధాని మోడీ (PM Modi) పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ట్వీట్ కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ పోరాటంలో 1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన పార్టీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధాని మోడీని ప్రశ్నిస్తోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
పప్పూజీ మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండని ఎద్దేవా చేశారు. మీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందన్నారు. ఒక ఓటు-రెండు రాష్ట్రాలు అని మొదటి సారిగా దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ముత్తాత మొదలు ఇప్పటి వరకు అంతా తెలంగాణను మోసం చేశారని ఫైర్ అయ్యారు.
జెంటిల్‌మన్ ఒప్పందం పేరిట తెలంగాణను ఆంధ్రాలో నెహ్రూ విలీనం చేశారని చెప్పారు. ఆ తర్వాత 1969లో ఇందిరా సర్కార్ కారణంగా సుమారు 369 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.1956లో ఏపీ ఏర్పాటైన రోజు నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని రాజీవ్ గాంధీ మాట ఇచ్చారన్నారు.
1400 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత ఇక రాబోయేది బీజేపీ సర్కార్ అని తెలిసే బిల్లును ప్రవేశపెట్టారన్నారు. అంతకు ముందు తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోడీ మాట్లాడారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అది తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే నని ఫైర్ అయ్యారు.