అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections)వేళ తెలంగాణ (Telangana)లో నేతల మధ్య మాటల యుద్ధం అణుబాంబులను మరిపిస్తుందని అనుకుంటున్నారు.. నరం లేని నాలుకకు నాలుగు మాటలు నేర్పిస్తే రెచ్చిపోయి పక్కోడి మీద పడినట్టు ఇప్పుడు నేతల గాలి బీసీ (BC)ల చుట్టూ తిరుగుతుందని వీరి మాటలు వింటున్న వారు నవ్వుతున్నారు.. పదవుల కోసం పూటకో పార్టీ మారే నేతలు రాష్ట్రాలను పాలించడం ఖర్మరా బాబు అంటూ తలలు కొట్టుకునే వారు మరోవైపు ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా బీజేపీ (BJP) ఎప్పుడైతే బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనే పదం ప్రచారంలో ప్రయోగించిందో అప్పటి నుంచి కులం చుట్టు రాజకీయాలు మొదలయ్యాయని పార్టీ వర్గాలలో అనుకుంటున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక బండి సంజయ్ (Bandi Sanjay) జోరు ఎక్కువగా కనిపించడం లేదు అనే టాక్ కార్యకర్తల్లో ఉంది. కానీ మాటు వేసిన సింహంలా అవకాశం చిక్కినప్పుడల్లా బండి సంజయ్, బీఆర్ఎస్ (BRS)పై ఘాటు వ్యాఖ్యలు విసురుతున్నాడని బండి అభిమానులు హ్యాపీగా ఉన్నారు.
ఈ క్రమంలో మరోసారి బండి సంజయ్ తన విశ్వరూపం ప్రదర్శించారు. బీసీలను కేటీఆర్ అవమానించారని తీవ్రంగా మండిపడ్డారు. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనగానే కేటీఆర్ ఉలిక్కి పడుతున్నాడని బండి సంజయ్ అన్నారు. గుణాల గురించి మాట్లాడే మీరు బీఆర్ఎస్లో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలి అంటూ ప్రశ్నించారు.
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమన్న బండి సంజయ్.. ఈ ఎన్నికలు పేదల పార్టీ బీజేపీకి, దోపిడీ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య జరుగుతున్న యుద్ధం లాంటివని అన్నారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్కక్కై కుట్రలు చేస్తున్నా బీజేపీ గ్రాఫ్ పడిపోదని తెలిపారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎగిరేది బీజేపీ జెండా అని ధీమా వ్యక్తం చేశారు..