Telugu News » New Jersey: తెలంగాణలో జరిగే అభివృద్ధి బీజేపీదే…బండిసంజయ్

New Jersey: తెలంగాణలో జరిగే అభివృద్ధి బీజేపీదే…బండిసంజయ్

రాబోయే ఎన్నికల్లో ఎన్నారైలు భారత్ కు వచ్చి ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న బండి సంజయ్ న్యూజెర్సీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజీపీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

by Prasanna
Bandi sanjay in New jersey

తెలంగాణా (Telangana) రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి (Daevelopment) కారణం నరేంద్ర మోడీ (Narendra Modi), భారతీయ జనతాపార్టీ (BJP) మాత్రమే నంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎన్నారైలు భారత్ కు వచ్చి ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న బండి సంజయ్ న్యూజెర్సీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజీపీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెంలంగాణాలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాష్ట్ర విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన హామీ గురించి ఈ సందర్భంగా తెలియజేశారు. క్వాలిటీ విద్యనందించడం, నీటిపారుదల సదుపాయాలు మెరుగుపరచడం, నిరంతరాయ విద్యుత్తును అందించడం…. మొదలైనవి బంగారు తెలంగాణాకు బెంచ్ మార్కులనీ, వాటిని సాధించడానికి నరేద్రమోడీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా బండి పేర్కొన్నారు. దీంతోపాటు గ్రామీణాభివృద్ధికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి కోసం ప్రవాస భారతీయులు కూడా తమ వంతు సాయం అందించాలని బండి సంజయ్ కోరారు.

ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (OFBJP ) మాజీ అధ్యక్షుడు అనుగుల కృష్ణా రెడ్డి, తెలంగాణ ఆఫ్-బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, వంశీ యంజాల, ప్రదీప్ రెడ్డి కట్టా, మధుకర్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA), నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (NATA), మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) తో పాటు ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు కూబి పాల్గొన్నారు.

You may also like

Leave a Comment