Telugu News » Neveen Polishetty: యూఎస్ లో దుమ్ముదులుపున్న ‘పొలిశెట్టి’ మూవీ

Neveen Polishetty: యూఎస్ లో దుమ్ముదులుపున్న ‘పొలిశెట్టి’ మూవీ

అనుష్క శెట్టి (Anushka shetty)  ఈ సినిమాలో నటించడంతో మంచి బజ్ మధ్య రిలీజైన ఈ మూవీ డే వన్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

by Prasanna
Naveen polishetty

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి”. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలతో పాటు యూఎస్ (US Collections) లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అనుష్క శెట్టి (Anushka shetty)  ఈ సినిమాలో నటించడంతో మంచి బజ్ మధ్య రిలీజైన ఈ మూవీ డే వన్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Naveen polishetty

ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బాగుందంటూ చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ సినిమా మహేష్ బాబుకు కూడా నచ్చడంతో కలెక్షన్స్ మరింత పెరిగాయి. మహేష్ అభినందనల ఎఫెక్ట్ యూస్ లో కూడా కనిపిస్తోంది. అక్కడ కూడా కలెక్షన్స్ పెరిగాయి.

షారూక్ ఖాన్ లెటేస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’ హోరులో కూడా పోలిశెట్టి సినిమా నిలకడగా కలెక్షన్స్ సాధించడం విశేషం. స్టాండప్ కమెడియన్ గా పోలిశెట్టి నవీన్ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా యూఎస్ కలెక్షన్స్ విషయానికి వస్తే…ఈ చిత్రం 8 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టుగా డిస్ట్రిబ్యూటర్ చెప్పారు. ప్రస్తుతం ఇప్పుడు 8 లక్షల 18 వేల డాలర్స్ వసూలు చేసి ఇంకా స్ట్రాంగ్ రన్ తో కొనసాగుతుంది అని తెలిపారు. దీనితో ఈ చిత్రం డెఫినెట్ గా వన్ మిలియన్ మార్క్ ని ఇప్పుడు క్రాస్ చేయనుంది అని నమ్మకం ఉందని తెలిపారు. ఇక ఈ చిత్రానికి రాధన్, గోపి సుందర్ లు సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment