Telugu News » Bandi Sanjay: మై డియర్ కమీషన్ రావు… నీకు ఎందుకు ఓటు వేయాలి….!

Bandi Sanjay: మై డియర్ కమీషన్ రావు… నీకు ఎందుకు ఓటు వేయాలి….!

కాంగ్రెస్ వాళ్లకు పైసలిచ్చి గెలిపించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని చేసినా డిసెంబర్ 3న కేసీఆర్ మాజీ సీఎం అవుతారని పేర్కొన్నారు.

by Ramu
bandi sanjay satire on cm kcr

ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ (BRS) ఓడిపోతుందని తెలుస్తోందని, అందుకే కేసీఆర్ (KCR) దుష్టపన్నాగాలు పన్నుతున్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు పైసలిచ్చి గెలిపించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని చేసినా డిసెంబర్ 3న కేసీఆర్ మాజీ సీఎం అవుతారని పేర్కొన్నారు.

bandi sanjay satire on cm kcr

 

ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా రమేశ్ రాథోడ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా జన్నారంలో ‘సింహగర్జన’పేరిట బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ… మై డియర్ కల్వకుంట్ల కమీషన్ రావు … అసలు నువ్వు ఏం చేశావని బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ప్రశ్నించారు.

కుంగిపోయిన కాళేశ్వరం చూద్దామంటే రావు అని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో వల్ల నష్టపోయిన విద్యార్థుల వద్దకు రావూ…317 జీవో వల్ల మరణించిన ఉద్యోగ కుటుంబాల దగ్గరికి రావూ…ఉద్యోగుల సమస్యలపై అసలు చర్చలకు రానే రావు…పోడు పట్టాల కోసం పోలీసు దెబ్బలు తిన్న గిరిజన బిడ్డల దగ్గరికి రావు… అసలు నువ్వు ఫాంహౌజ్ విడిచి రానే రావు… మరి నీకెందుకు ఓటేయాలి అంటూ ధ్వజమెత్తారు.

అందుకే తాను ఓ మాట చెబుతున్నానన్నారు… ఈ ఎన్నికల్లో నువ్వు అధికారంలోకి రావు.. రానే రావు… రావు…అసలు రానే రావు… కావాలస్తే రాసిపెట్టుకో…’అంటూ వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు మాట్లాడుతుంటే కేసీఆర్ కొడుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అమెరికాలో కేటీఆర్ నెలకు కోటి రూపాయల జీతం తీసుకునేవాడట అని అన్నారు. అసలు అమెరికాలో చిప్పలు కడిగేటోడికి కోటి రూపాయలు ఎవరిస్తారు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నెలకు కోటి సంపాదించానని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి సంగతి ఎందుకు చెప్పడం లేదన్నారు. రాష్ట్రాన్ని దోచుకుని ప్రాజెక్టుల పేరిట కమీషన్లు దొబ్బి రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిండని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పుట్టబోయే బిడ్డపై కూడా లక్షన్నర రూపాయల అప్పు చేసిండన్నారు.

కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడు ఒక్కటేనన్నారు. ఆ పార్టీలు కుమ్కక్కై బీజేపీని దెబ్బతీసి అధికారంలోకి రావాలని చూస్తున్నాయన్నారు. కాంగ్రెస్, ఎంఐఎంకు ఓట్లేస్తే బీఆర్ఎస్‌కు పడ్డట్లేనన్నారు. మీడియాలో ప్రచారాలే తప్ప కాంగ్రెస్‌కు అసలు క్యాడర్ లేనేలేదన్నారు. పాతబస్తీలోకి సభ పెట్టాలంటే ఎంఐఎం అనుమతి తీసుకోవాలంటూ ప్రగల్భాలు పలికిన ఒవైసీకి డేట్, టైం ఫిక్స్ చేసి తాను సవాల్ విసిరినన్నారు. గుండెపోటుతో చావు అంచుదాకా వెళ్లి వచ్చానన్నారు. అలాంటి తాను ఆ బెదిరింపులకు భయపడతానా? అని అన్నారు.

కేసీఆర్ దుష్టపాలన వల్ల ఇప్పుడు రాష్ట్రంలో జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. గిరిజనేతరులకు పోడు పట్టాలిస్తానని కేసీఆర్ అన్నాడట అని తెలిపారు. ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు పట్టాలే ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశాు. ఇప్పుడు కొత్తగా గిరిజనేతరులకు పట్టాలిస్తామని ప్రకటన చేసి గిరజనులు, గిరిజనేతరుల మధ్య కొట్లాట పెట్టాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.

You may also like

Leave a Comment