బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వం(Hinduism), ధర్మ పరిరక్షణ(Preservation of Dharma)కు పోరాడుతానని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పొత్తుపై బండి సంజయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఛీ కొట్టిన బీఆర్ఎస్ పార్టీతో తాము ఎందుకు పొత్తు పెట్టుకుంటామని ఫైర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోదని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందని ఎవరైనా అంటే వాళ్లను చెప్పుతో కొట్టండి అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదేవిధంగా ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వం, ధర్మ రక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని బండి చెప్పారు. కేంద్రంలో బీజేపీ మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు గ్యారంటీగా వస్తాయన్నారు. దేశానికి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాకాయికారీ ఒప్పందం ఉందని.. ఇందులో భాగంగా బీజేపీని దెబ్బ తీయడానికి బీఆర్ఎస్‌తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వైపు రాముడు, ప్రధాని మోడీ ఉన్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.