Telugu News » జగన్ మోహన్ రెడ్డి అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చిన బర్రెలక్క ! పవన్ ని ఆకాశానికి ఎత్తేసింది గా !

జగన్ మోహన్ రెడ్డి అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చిన బర్రెలక్క ! పవన్ ని ఆకాశానికి ఎత్తేసింది గా !

by Sravya
YSR Kalyanamasthu: Govt Kalyanamasthu, Shaadi Tofa funds released.. CM pressed the button..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేపుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసి తెచ్చుకున్న ఓట్ల మీద ఏపీ సీఎం స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నారని అన్నారు. బర్రెలక్క మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ కి హితాబోధ చేసే ప్రయత్నం చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. రాజకీయాల్లో ఎవరి జీవితం వాళ్ళది ఎవరు పార్టీ వాళ్ళది.

కానీ పవన్ కళ్యాణ్ ని తక్కువ చేసి మాట్లాడడం సరికాదు. ఏపీ సీఎం అలా మాట్లాడటం నాకు బాధ కలిగింది అని ఆమె చెప్పింది. ఆయన పవర్ ఆయనదీ నా పవర్ నాది పవన్ కళ్యాణ్ ఎంత మంచి వారు అనేది అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పక్కర్లేదు అని శిరీష తన అభిప్రాయాన్ని చెప్పింది. అలానే పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తితో నన్ను పోల్చడం కూడా సరికాదని చెప్పింది. ప్రముఖ వ్యక్తితో నన్ను పోల్చడం నాకు బాధ కలిగిందని చెప్పింది.

Also read:

అందుకనే ఏపీ సీఎం వ్యాఖ్యలపై నేను స్పందించబోను కానీ పవన్ కళ్యాణ్ గ్రేట్ పర్సన్ అని ఆయన ని తక్కువ చేసి మాట్లాడడానికి ఆయనతో నన్ను పోల్చడం సరికాదని బర్రెలక్క శిరీష చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ తో పోల్చడం హ్యాపీగా ఉంది ఆయన ప్రజలకి ఎలాంటి పోరాటం చేస్తున్నారో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ కి డబ్బు వెనుక వేసుకోవడం తెలియదు. ప్రజా సేవ చేయాలని పోరాటం చేస్తున్నారు అని బర్రెలక్క చెప్పింది. బర్రెలక్క కేసీఆర్ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ లో విషయంలో వైఫల్యం పొందిందని విమర్శతో అసెంబ్లీ ఎన్నికల్లో మెహబూబ్ నగర్ జిల్లా నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment