రాజకీయాలపై యువత ఆసక్తి చూపుతున్నారనడానికి ఇటీవల జరిగిన ఎన్నికలే నిదర్శనంగా నిలిచాయి. తెలంగాణలో నిరుద్యోగుల తరఫున సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమ్ సంపాదించుకున్న బర్రెలక్క(శిరీష) గురించి తెలిసిందే. ఎన్నికల్లో ఓడినా ఆమె బరిలో దిగిన స్థానంలో గట్టి పోటీనిచ్చింది. ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది.
అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయిన మరో అమ్మాయి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందింది. ఇటీవల జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో(Mizoram Assembly Elections) పీపుల్స్ మూమెంట్ పార్టీ తరఫున 32 ఏళ్ల బారిల్ వన్నెసంగి (Baryl Vanneihsangi) ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందింది. చూడ్డానికి మోడల్‌గా కనిపించే ఈ అమ్మాయి ఆ రాష్ట్రానికి ఎన్నికైన యువ మహిళా ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేసింది.
ఆమె ఐజ్వాల్ సౌత్-3 నియోజకవర్గం నుంచి బారిల్ గెలుపొందింది. 1414 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించడం విశేషం. వన్నెసంగి షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీలో ఆమె ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. గతంలో ఆమె రేడియో జాకీగా చేసింది. టెలివిజన్ ప్రెజెంటర్‌గానూ చేసింది.
వన్నెసంగి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పాపులర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.5లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె టీవీ యాంకర్‌గా పనిచేసి లింగ సమానత్వంపై తన గళాన్ని వినిపించింది. ప్రభుత్వ వ్యవస్థలోకి మహిళలు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చింది. మిజోరం ఎన్నికల్లో ఈసారి ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రాష్ట్రంలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి.