Telugu News » Battina passed away : చేపమందు చక్రవర్తి  హరినాథ్..అమరులయ్యారు..!!

Battina passed away : చేపమందు చక్రవర్తి  హరినాథ్..అమరులయ్యారు..!!

చేప మందు చక్రవర్తి స్వర్గస్తులయ్యారు. మానవ శ్వాస కోశాని వెలకట్టలేని వైద్య సేవలందించి ప్రకృతి వైద్యడు తుది శ్వాస విడిచారు.

by sai krishna

చేప మందు చక్రవర్తి స్వర్గస్తులయ్యారు. మానవ శ్వాస కోశాని వెలకట్టలేని వైద్య సేవలందించి ప్రకృతి వైద్యడు తుది శ్వాస విడిచారు. ఎందరో ఆస్తమా రోగులకు కొండంత అండగా బతికిన బత్తిని హరినాథ్ గౌడ్(84) తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు.

ఊపిరున్నంత వరకు తనను నమ్ముకుని వచ్చిన వారికి ఉపశమన ఊపిరిపోశారు బత్తిని. 40 సంవత్సరాలుగా ఆయన షుగర్‌ వ్యాధితో బాధ పడుతున్నారు.

ఆయనకు భార్య సుమిత్రాదేవి, కూతుళ్లు అల్కనంద, అర్చన, కొడుకులు అనిల్ గౌడ్, అమర్ నాథ్ గౌడ్(Amarnath Goud) సంతానం ఉన్నారు. వీరిలో అల్కనంద, అనిల్ గౌడ్ అమెరికాలో ఉంటున్నారు.

బత్తిని హరినాథ్ గౌడ్ చనిపోయారని తెలియగానే ఆయన అభిమానులు, గతంలో అనారోగ్య సమస్యలతో ఉండి నయం అయిన వారు కవాడిగూడలో ఉన్న ఆయన పార్థీవదేహాన్ని చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు.

బత్తిని హరినాథ్ గౌడ్ మృతిలో కవాడిగూడలో విషాదఛాయలు అలముకున్నాయి. రేపు( శుక్రవారం ) బన్సిలాల్ పేట స్మశాన వాటికలో హరినాథ్ గౌడ్ అంత్యక్రియలు జరుగనున్నట్లు ఆయన కుమారుడు అమర్ నాథ్ గౌడ్ తెలిపారు.

బత్తిని హరినాథ్ గౌడ్ ముత్తాత్త బత్తిని వీరన్న గౌడ్(Battini Veeranna Goud)1845లో దూద్ బౌలిలో శంకర్ లేన్ లో..ఈ చేప మందు పంపిణీని ప్రారంభించారు. ఆ తర్వాత హరినాథ్ గౌడ్ తండ్రి శంకరయ్య గౌడ్ కొన్ని సంవత్సరాలు చేప మందు పంపిణీని కొనసాగించారు.


ఆయన చనిపోవడంతో హరినాథ్ గౌడ్ వారి నాన్నమ్మ సత్యమ్మ చేపమందు పంపిణీని కొనసాగించారు. ఆ తర్వాత హరినాథ్ గౌడ్ ఈ చేపమందు పంపిణీని వారసత్వంగా తీసుకొని ప్రతి ఏటా నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Nampally Exhibition Ground)లో పంపిణీ చేస్తున్నారు.

ఆయన అనారోగ్య సమస్యలతో ఉండడంతో ఆయన కొడుకులు ఈ సంవత్సరం జూన్ నుంచి చేప మందు పంపిణీ బాధ్యతను తీసుకున్నారు. బత్తిని హరినాథ్ గౌడ్ తాతకు దూద్ బౌలితో పాటు గౌలిగూడలో ఇళ్లు ఉండేవి.

బత్తిని హరినాథ్ గౌడ్ తల్లిదండ్రులు గౌలిగూడలో ఉండేవారు. హరినాథ్ గౌడ్ గౌలిగూడ నుంచి మదీన వద్ద ఉండే స్కూల్ లో విద్యనభ్యసించారు.ఆపై సిటీ కాలేజ్ లో బీఎస్సీ గ్రాడ్యుయేట్ అయ్యారు.

 

ఆస్తమ, శ్వాస, దగ్గు సంబంధిత వ్యాధులతో ఇబ్బందులుపడే లక్షలాది మంది ప్రజలకు చేపమందు ఇచ్చి బత్తిని హరినాథ్ గౌడ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి అగర్వాల్ సేవా దల్(Aggarwal Seva Dal), అగర్వాల్ సమాజ్, పంజాబి సేవా సమితి తదితర సంఘాలు ఆయన్ను గతంలో సన్మానించి, ప్రశంసా పురస్కారాలను అందచేశాయి.

You may also like

Leave a Comment