Telugu News » BCCI: మూడు టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఆ ముగ్గురు ఔట్..!

BCCI: మూడు టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఆ ముగ్గురు ఔట్..!

సొంతగడ్డపై టీమిండియా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. చివరి మూడు టెస్టులకూ బీసీసీఐ(BCCI) జట్టును ప్రకటించింది.

by Mano
BCCI: BCCI announced the team for three tests.. those three are out..!

సొంతగడ్డపై టీమిండియా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. చివరి మూడు టెస్టులకూ బీసీసీఐ(BCCI) జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ(Virat Kohli), శ్రేయస్ అయ్యార్(Shreyas Iyer)లు జట్టుకు దూరమయ్యారు.

BCCI: BCCI announced the team for three tests.. those three are out..!

రెండో టెస్టుకు గాయాల కారణంగా దూరమైన జడేజా, కేఎల్ రాహుల్‌లకు షరతులతో జట్టులో చోటు కల్పించారు. మెడికల్ టీమ్ నుంచి ఫిట్ నెస్ క్లియరెన్స్ వస్తేనే వారిని తుది జట్టులోకి తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది. మరోవైపు మూడు టెస్టులకు తాను దూరంగా ఉంటున్నట్లు కోహ్లీ తెలిపిన నేపథ్యంలో ఆయనను జట్టులోకి తీసుకోలేదు.

తొలి టెస్టులో ఓడినా రెండో టెస్టులో గెలిచి పాయింట్ల పట్టికను సమం చేసిన టీమిండియా మూడో టెస్టుకు రెడీ అవుతుంది. ఇరు జట్లు రాజ్‌కోట్‌లో ఈనెల 15వ తేదీన తలపడనున్నాయి. రెండో మ్యాచ్ తర్వాత ఇళ్లకు వెళ్లిన టీమిండియా ప్లేయర్లు మూడో టెస్టు కోసం ఆదివారం రాజ్‌కోట్ చేరుకోనున్నారు.

భారత్ జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురేల్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ఆకాశ్ దీప్‌, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్.

You may also like

Leave a Comment