రాజస్థాన్ (Rajasthan) కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. భజన్ లాల్ శర్మ (Bhajan Lal Sharma)ను నూతన సీఎంగా బీజేపీ (BJP) అధిష్టానం ఎంపిక చేసింది. జైపూర్ జరిగిన భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు.. భజన్ లాల్ శర్మను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం వసుంధర రాజేను కాదని పార్టీ అధిష్టానం ఆయనవైపు మొగ్గు చూపడం రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.
మరోవైపు బీజేపీ అధిష్టానం ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)..మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో కూడా ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులను నియమించింది. దియాకుమారి, ప్రేమ్ చంద్ భైరవను ఎంపిక చేసింది. వాసుదేవ్ దేవ్నానిని అసెంబ్లీ స్పీకర్‌గా నియమించింది. గెలిచిన రెండు రాష్ట్రాలకు ఇప్పటికే ముఖ్యమంత్రులను ప్రకటించిన కమలం.. గిరిజన సామాజిక వర్గానికి చెందిన విష్ణు దేవ్సాయ్ని ఛత్తీస్‌గఢ్ సీఎంగా నియమించింది.
మరోవైపు మధ్యప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. సీఎం రేసులో ఉన్న వారిని కాదని, కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చి మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. కాగా నవంబర్ 25న 199 స్థానాలకు జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.. అధికార కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చి, మూడు చోట్ల కాషాయ జెండా ఎగరేసింది..